Ads
రోజు గడవాలి అంటే టీవీ సీరియల్స్ అనేది చాలా మంది జీవితంలో ఒక భాగం అయిపోయింది. టీవీ సీరియల్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ డ్రామా ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ కి మాత్రం డిమాండ్ గట్టిగానే ఉంటుంది.
Video Advertisement
అందుకే ప్రతి సీరియల్ లో డ్రామా చాలా ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటున్నారు. డ్రామా ఎక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ కథ అసలు ఉండట్లేదు. ప్రతి సీరియల్ ఒకటే టెంప్లేట్ లో నడుస్తోంది.
ఒక హీరో, ఒక హీరోయిన్, ముందు గొడవలు పడడం, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, తర్వాత కాంట్రాక్ట్ మ్యారేజ్ అనుకోవడం, తర్వాత మళ్లీ ప్రేమించుకోవడం, వాళ్ల మధ్య ఇంకొక హీరోయిన్, హీరోకి పెళ్లి అయ్యింది అని కూడా ఆలోచించకుండా హీరో వెనకాల పడుతూ ఉంటుంది. హీరో వాళ్ళ తల్లి. హీరోయిన్ ని ఇబ్బందులు పెట్టడం, లేదా మద్దతు ఇవ్వడం. హీరోయిన్ కి సీరియల్ మొదలు అయ్యే ముందు జీవితంలో ఏదో సాధించాలి అని ఒక లక్ష్యం ఉంటుంది.
కానీ ఒక్కసారి హీరోతో పెళ్లి అయ్యాక లక్ష్యం లేదు. ఏం లేదు. ప్రేమ కోసం తిరుగుతూనే ఉంటుంది. హీరోయిన్ వస్త్రధారణ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. అలా ఉంటేనే హీరోయిన్ అయినట్టు. వస్త్రధారణ స్టైలిష్ గా ఉంటే విలన్ అయినట్టు. ఇదెక్కడి లాజిక్ అని మీరు అనుకుంటున్నారా? ఇది సీరియల్ లాజిక్. పాతకాలంలో అంటే ఇలాంటి లాజిక్స్ ఉన్నాయి అంటే ఏదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందుకు ఉదాహరణ ఇంటింటి గృహలక్ష్మి.
అందులో హీరోయిన్ అయిన తులసి ఏమో చాలా పద్ధతిగా కాటన్ చీరలు కట్టుకుంటూ ఉంటుంది. స్టైలిష్ గా ఉద్యోగం చేసుకునే లాస్య ఏమో విలన్. కార్తీకదీపం సీరియల్ లో కూడా అంతే. ఇప్పుడు వస్తున్న మల్లి సీరియల్ లో కూడా అంతే. విలన్స్ అందరూ స్టైలిష్ గానే ఉంటారు. హీరోయిన్స్ అందరూ పద్ధతిగానే ఉంటారు. కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో హీరోయిన్ డాక్టర్ అవ్వాలి అనే కలతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అవేమీ లేకుండా ఎటో వెళ్లిపోయింది.
ఇంకొక విషయం ఏంటి అంటే, ఇవన్నీ రీమేక్ సీరియల్స్. కానీ ఒరిజినల్ సీరియల్స్ లో డ్రామా ఉన్నా కూడా ఇంత ఎక్కువగా ఉండదు. కానీ మన తెలుగు నేటివిటీ కోసం మన సీరియల్స్ లో చేస్తున్న మార్పులు మాత్రం ఎప్పుడో పాతకాలం కథలు గుర్తుకు తెచ్చే లాగా ఉన్నాయి. ఒకవేళ కాస్త ఉన్నతమైన ఆలోచనలతో, ఒక హీరోయిన్ తన కల నెరవేర్చుకుంది అని ఒక కాన్సెప్ట్ తో సీరియల్ తీద్దాం అన్నా కూడా డైరెక్టర్లను ఏం ఆపుతోంది? మనమే ఆపుతున్నాం.
సాధారణంగా రేటింగ్ ఎక్కువ ఎలాంటి వాటికి వస్తే తమ సీరియల్స్ లో అలాంటి కాన్సెప్ట్ లని పెట్టాలి అని అనుకుంటారు. ఇప్పుడు మరి అత్తా కోడళ్ళ డ్రామాలకి, హీరో, హీరోయిన్, మధ్యలో ఇంకొక అమ్మాయి, లేదా ఇంకొక అబ్బాయి వచ్చి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రేమ కథలకి అంత రేటింగ్ వస్తోంది. అందుకే డైరెక్టర్లు కూడా ఇలాంటి సీరియల్స్ తీస్తున్నారు. ఇలా చూస్తే మరి తప్పు ఎవరిది. ఇలా చేయడానికి ముఖ్య కారణం ఎవరి వైపు నుండి ఉంది.
ALSO READ : “సందీప్ కిషన్” కుమారి ఆంటీకి ఎంత డబ్బు సాయం చేసారో తెలుసా.?
End of Article