వాళ్ల సంగతి సరే..! మరి వీళ్ళు ఏం చేస్తున్నారు..?

వాళ్ల సంగతి సరే..! మరి వీళ్ళు ఏం చేస్తున్నారు..?

by Mohana Priya

Ads

ఏ రంగంలో అయినా సరే గెలవడం, ఓడిపోవడం అనేది సహజం. ఒకవేళ ఒక మనిషి ఏదైనా ఒక విషయంలో ఓడిపోతే, దానిలో నుండి ఆ మనిషి ఏం నేర్చుకుంటాడు? ఆ తర్వాత అదే పొరపాటు మళ్ళీ చేయకుండా ఎలా జాగ్రత్త పడతాడు అనేది మనం ఆ ఓటమి నుండి గ్రహించాల్సిన విషయం.

Video Advertisement

అంతే కాకుండా ఒకవేళ మనిషికి ఏదైనా బాధాకరమైన సంఘటన ఎదురైతే దానికి ఆ మనిషి ఎంతవరకు బాధ్యత వహిస్తాడు అనేది కూడా ముఖ్యమైన విషయం. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా హిట్ అవ్వడం పోవడం అనేది అవుతూనే ఉంటాయి.

Prabhas-Project-K-First-Look

సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమా బృందం ఎలా ఉన్నారు? అదే ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు వారు ఎలా ఉన్నారు అనేది జనాలు చూస్తూ ఉంటారు. ఈ విషయానికి హీరోలు కూడా మినహాయింపు ఏమీ కాదు. ఒక హీరోకి హిట్ వచ్చినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ హీరో ఫ్లాప్ ఎదురుకున్నప్పుడు వారి మాటలు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని కూడా ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు.

properties of hero prabhas..

అయితే ఒక సినిమా ఫ్లాప్ అయ్యాక నెక్స్ట్ సినిమాతో అయినా ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరు అనే ఒక ఆశ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంత మంది హీరోలు మాత్రం చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఈ విషయంలో ముందు వరుసలో ఉండే హీరో ప్రభాస్. కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వాలి అనుకోవడం చాలా మంచి విషయం. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇప్పటి వరకు సరైన హిట్ లేదు.

manchu vishnu comments on prabhas aadipurush..

బాహుబలి కంక్లూషన్ వచ్చి ఆరు సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభాస్ వి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాహుబలి తర్వాత వచ్చిన సాహో ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. సినిమా చాలా స్టైలిష్ గా ఉన్నా కూడా కథ అందరికీ తెలిసిన కథ అవ్వడంతో సినిమాకి అంత మంచి టాక్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ పరిస్థితి కూడా ఇంతే. సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్స్ తో ప్రేక్షకుల అంచనాలని ఎక్కడికో తీసుకెళ్లి అక్కడి నుండి పడేశారు.

దీనితో పోలిస్తే సాహో సినిమా నయం అన్నారు. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొదటి నుండి కూడా ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. ఇప్పుడు దీనితో పోల్చి చూస్తే రాధే శ్యామ్ సినిమా చాలా బెటర్ అని అంటున్నారు. ఈ 3 సినిమాల తర్వాత దర్శకులు తమ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయడానికి చాలా సమయం పట్టింది. సాహో రిలీజ్ అయిన 4 సంవత్సరాల తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేశారు. రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు.

reason behind prabhas movies disappoing after bahubali

ఇంక ఆదిపురుష్ దర్శకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తనకి వచ్చే ట్రోలింగ్ తట్టుకోలేక కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం మాత్రం మర్చిపోతున్నాం. ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు బాధ్యత ఎంత ఉందో, ఆ సినిమాని ఓకే చేసిన హీరో బాధ్యత కూడా అంతే ఉంటుంది కదా? హిట్ అయినప్పుడు ఏమో, “మా హీరో వల్ల హిట్ అయ్యింది” అన్న వాళ్లు, ఫ్లాప్ అయినప్పుడు డైరెక్టర్ ని ఇంత ఘోరంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఈ విషయం కేవలం ప్రభాస్ కి మాత్రమే కాదు ఇంకా కొంత మంది హీరోలకి కూడా వర్తిస్తుంది.

bholaa shankar movie review

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి నుండి కూడా అంత గొప్ప సినిమాలు రావట్లేదు. అంతకుముందు ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఒక హీరో, జాతీయ స్థాయిలో గొప్ప నటుడు అని పేరు తెచ్చుకున్న హీరో ఇప్పుడు రీమేక్ సినిమాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మధ్యలో వచ్చిన సైరా నరసింహారెడ్డి చిరంజీవిలోని నటుడిని మరొక సారి ఆవిష్కరించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా, చిరంజీవి చాలా గొప్ప నటుడు అని మరొక సారి ఈ సినిమా నిరూపించింది.

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంత పెద్దగా ఆకట్టుకోలేదు. వాల్తేరు వీరయ్య సినిమా కమర్షియల్ సక్సెస్ అయినా కూడా చాలా విషయాలపై కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతోంది. అయితే ఈ విషయంలో ఎక్కువ మంది మెహర్ రమేష్ ని మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. ఇంక పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన ప్రతి సారి త్రివిక్రమ్ ని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలు త్రివిక్రమ్ సెలెక్ట్ చేస్తారు అని, అందులో మార్పులు కూడా ఆయనే చేస్తారు అని అంటున్నారు.

bro movie review

కానీ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సినిమాలు చేయాలి అనే అవగాహన ఉంది కదా? ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కొంత మంది హీరోలు తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు, “ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు బాధ్యత నాదే. నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్త తీసుకుంటాను” అని బహిరంగంగానే ప్రేక్షకులను క్షమాపణలు అడుగుతారు. మరి కొంత మంది హీరోలు నిజంగానే నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని రిజల్ట్ పరంగా చూపిస్తారు. కానీ ఈ హీరోల విషయంలో మాత్రం ఏదీ జరగట్లేదు.

రామాయణం గురించి మిగిలిన వారికి తెలిసి ఉండదా? లేకపోతే రామాయణం మీద సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం తెలుసుకోరా? తెలిసినప్పుడు డైరెక్టర్ తప్పు చేస్తూ ఉంటే చెప్పొచ్చు కదా? మన తెలుగు సంస్కృతి గురించి అంత బాగా తెలిసిన హీరో, మన తెలుగులో రామాయణం ఎలా ఉంటుంది అని తెలియని ఒక బాలీవుడ్ డైరెక్టర్ తప్పులు చేస్తూ ఉంటే, “ఇది తప్పు” అని, “మా సంస్కృతి ఇలా ఉంటుంది” అని చెప్పలేకపోయారా? భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ కి జుట్టు తీయకుండా ఆపరేషన్ చేసి, అదేదో వీడియో ప్లేయర్ కి పెట్టినట్టు తల చుట్టూ వైర్లు పెట్టారు. తలకి ఆపరేషన్ చేసేటప్పుడు జుట్టు తీయాలి అనే విషయం ఎవరికైనా తెలుస్తుంది కదా?

ఇలాంటి సీన్స్ చూసేటప్పుడు ఇది తప్పు అని దర్శకుడికి ఎవరు చెప్పలేకపోయారా? యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలకి అంటే చెప్పే వీలు ఉండదు, దర్శకుడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇంత పెద్ద స్టార్ హీరోలు అయ్యాక, అక్కడ చెప్పే ఆప్షన్ ఉన్నా కూడా వారు ఒక్కసారి కూడా చెప్పలేకపోయారా అనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. సినిమా హిట్ అయినప్పుడు మా హీరో వల్ల హిట్ అయ్యింది అనడం, సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఈ డైరెక్టర్ కి సినిమాలు తీయడం రాదు అని కామెంట్ చేయడం అనే ధోరణి మారినప్పుడే మంచి సినిమాలు వస్తాయి ఏమో.

ALSO READ : “విక్రమ్” సినిమాలో “సంతానం గ్యాంగ్ మెంబర్” గా నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?


End of Article

You may also like