సినిమా అనేది జనాలకి ఒక ఎమోషన్ అయిపోయింది. అందుకే చాలా మంది సినిమాల ద్వారా ఎన్నో విషయాలని ప్రేక్షకులకు చెప్తూ ఉంటారు. సినిమాలు అన్నీ కూడా మంచి సందేశాలు మాత్రమే ఇవ్వవు. నిజ జీవితంలో ఉండే ఎంతో మంది మనుషుల గురించి, వారు ఎదుర్కొన్న ఎన్నో సంఘటనల గురించి సినిమాల్లో చూపిస్తారు.

Video Advertisement

అయితే ఈ క్రమంలో హీరోలు కేవలం మంచి అనే పదానికి ఉదాహరణగా మాత్రమే కాకుండా వారిలో కూడా ఎన్నో లోపాలని ఉన్నట్టు చూపిస్తారు. ఏదో సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు హీరోల పాత్రలు గ్రే షేడ్స్ ఉన్నాయి అని అంటున్నారు కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలం నుండే ఎన్నో సినిమాల్లో హీరోలు పర్ఫెక్ట్ గా లేనట్టు చూపించారు. ఇదే విషయం హీరోయిన్ల పాత్రని తీర్చిదిద్దే విధానానికి కూడా వర్తిస్తుంది.

baby movie review

ఇంక అసలు విషయానికొస్తే, చాలా రోజుల నుండి మాట్లాడుకుంటున్న ఒక సినిమా ఇప్పుడు విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా పేరు చెప్పకుండానే ఆ సినిమా ఏంటో అందరికీ ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. అవును. అదే సినిమా. బేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది, “రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ చూపించారు” అని అంటూ ఉంటే, కొంత మంది ఏమో, “ఇలాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు?” అని అంటున్నారు.

baby movie review

సమాజానికి ఇచ్చే మెసేజ్ పక్కన పెడితే, అసలు థియేటర్ రెస్పాన్స్ అని చెప్పి వచ్చిన వీడియోలో ఆ థియేటర్ రెస్పాన్స్ చూస్తే తప్పు ఎవరిలో ఉందో అర్థం అయిపోతోంది. ఒక డైరెక్టర్ బాధ్యత తాను ఎంచుకున్న పాయింట్ ని తెరపై బాగా చూపించడం. ప్రతి డైరెక్టర్ మెసేజ్ ఇచ్చే సినిమాలు మాత్రమే తీయరు. ఆ సినిమా నుండి తీసుకునే మెసేజ్ మనలో ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ బేబీ సినిమా థియేటర్ రెస్పాన్స్ వీడియో.

ఇందులో హీరోయిన్ ని హీరో ఒక బూతు మాట పెట్టి తిడతాడు. ఆ ఒక్క మాటతో ఆగకుండా ఇంకా ఎన్నో మాటలు మాట్లాడి అవమానిస్తాడు. ఈ సీన్ చాలా వైరల్ అయ్యింది. “అసలు సినిమాలో ఇలాంటి ఒక తిట్టు ఎలా పెట్టారు” అని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ తర్వాత ఇదే విషయంపై హీరో మాట్లాడుతూ చదువు లేని వాడిని అని, ఆటో డ్రైవర్ ని అని, అలాంటి తనకి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన మాటలు ఎలా వస్తాయి అని చెప్తాడు. ఇది నిజమే కదా? కానీ డైరెక్టర్ ఇచ్చిన ఈ జస్టిఫికేషన్ వదిలేసి, హీరో తిట్టిన పదాన్ని మాత్రమే హైలైట్ చేసి దాని వీడియో పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది.

baby movie review

నిజంగా మనకి సామాజిక బాధ్యత ఉంది, అందుకే సినిమాల్లో ఇలాంటివి ఉండద్దు అని అంటున్నాం అని అనుకుందాం. కానీ తర్వాత వచ్చిన వీడియో ఈ అభిప్రాయాన్ని మార్చేస్తుంది ఏమో. ఇంటర్వెల్ కి ముందు హీరోయిన్ చేసిన ఒక పని తర్వాత, హీరోయిన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అంతకుముందు హీరో తిట్టిన బూతు పదాన్ని ఆడియన్స్ గట్టిగా అరుస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. పెద్ద హీరోల సినిమాల్లో హీరో ఎంట్రీకి ఎంత గట్టిగా అరుస్తూ రెస్పాన్స్ ఉంటుందో, అంత సౌండ్ తో తెరపై కనిపిస్తున్న ఒక అమ్మాయి పాత్రని అంత సభ్యకరమైన బూతు తిట్టారు.

మరి హీరో ఒక అమ్మాయిని తిట్టినప్పుడు అంత కోపం వచ్చింది, స్క్రీన్ మీద కనిపించే అమ్మాయి పాత్రని ఈ మాట మాత్రం మనం అనొచ్చా? సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే చాలా కామెంట్స్ థియేటర్లో ఒకరు ఇది చూసి నా కథ అన్నారు అని, మరొకరు చూసి హీరోయిన్ వచ్చినప్పుడు నా పక్కన సీట్ లో ఉన్నవాడు ఈ మాట తిట్టాడు అని, ఒకరు ఏమో అందులో నన్ను మోసం చేసిన అమ్మాయిని చూసుకున్నా అని, ఇంకొకరు అయితే అమ్మాయిలు అందరూ అంతే అని చాలా కామెంట్స్ ఇవే ఉన్నాయి.

baby movie review

అంతే కాకుండా ఈ సినిమాలో దర్శకుడు కేవలం హీరోయిన్ ని మాత్రమే కాదు, హీరోలో ఉన్న తప్పులని కూడా అంతే స్పష్టంగా చూపించారు. అసలు హీరోయిన్ అడగకుండానే హీరో ఆమె కోసం గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చాలా చేస్తాడు. అలాగే కొన్ని పనులు ఆలోచించకుండా చేస్తాడు. తన తప్పు ఏమీ లేదు ఆ అమ్మాయే తనని మోసం చేసింది అన్నంతగా బాధపడతాడు. అసలు హీరో ఆలోచన విధానం ఎక్కడ ఉందో, అసలు తను చేసే పని మీద తనకి క్లారిటీ అయినా ఉందా లేదా, తన మీద తనకి కంట్రోల్ లేకుండా హీరో ప్రవర్తించిన తీరు అనే విషయాలని కూడా దర్శకుడు చాలా బాగా చూపించారు.

కానీ అది సినిమా చూసిన వారిలో చాలా తక్కువ మందికి అర్థం అయ్యింది. సినిమాలో చూపించిన పాత్రలు ఎలా ఉన్నాయి, దర్శకుడు ఎలాంటి తప్పులు చేశారు అనే విషయం పక్కన పెడితే అసలు ఇలాంటి సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ రియాక్షన్ వీడియోలు అని ఇలాంటి అసభ్యకరమైన పదాలు వాడుతున్న థియేటర్ రెస్పాన్స్ చూసినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కదా కనిపిస్తుంది? దాంతో ఇప్పుడు ఈ విషయంపై కూడా కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి.

baby movie review

సినిమాలో హీరో తిట్టినప్పుడు చాలా మంది స్పందించి ఇది తప్పు అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఈ విషయంపై స్పందించి ఇలా అన్న వారిపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇదంతా చూసినప్పుడు సినిమా వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియదులే కానీ, మనలో చాలా లోపాలు ఉన్నాయి అనే విషయం మాత్రం అర్థం అవుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా వాళ్ళని ప్రశ్నించే ముందు ఇలాంటి సెన్సిబుల్ విషయాలని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ సినిమా చూసే ప్రేక్షకులకు రావాలి.