రానా దగ్గుబాటి హీరోగా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా, వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ తనదైన శైలిలో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. తన మొదటి చిత్రం ‘లీడర్’ నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘విరాట పర్వం’ వరకు సినిమాల కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు.

Video Advertisement

రానా నటించిన చిత్రాలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండు ఏళ్లు అవుతోంది. ఇది ఇలా ఉంటే లీడర్ సినిమాలోని పాటల పై సోషల్ మీడియాలో తాజాగా చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఫిల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లీడర్’. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటిదాకా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి చిత్రాలను తీసిన శేఖర్ కమ్ముల సడెన్ గా పొలిటికల్ డ్రామాతో లీడర్ సినిమాను తీశారు. ఈ చిత్రంతో దగ్గుబాటి వారసుడు రానా హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మించారు.2010లో ఫిబ్రవరి 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తొలి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను వచ్చాయి. కానీ తరువాత రోజుల్లో ఎక్కువగా వసూళ్లు సాదించలేకపోయింది. ఎగ్జామ్స్ సీజన్ లో ఈ సినిమా రిలీజ్ అవడంతో బ్రేక్ ఈవెన్ చేయలేక అబౌవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. వేరే సమయంలో  రిలీజ్ అయితే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉండేది. అయినా ఈ మూవీ క్లాసిక్ గా నిలిచింది. అర్జున్ ప్రసాద్ గా రానా నటన అత్యద్భుతం. మొదటి సినిమా అనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలిగించకుండా అద్భుతంగా నటించాడు.ఈ చిత్రంలోని పాటలను వేటూరి గారు రాశారు. ఆయన రాసిన వందేమాతరం పాటఎంతో అర్ధవంతంగా ఉంటుంది. ఈ పాటలోని “చితిలోనే సీమంతం” పదానికి అర్ధం ఏమిటని ‘రంగుల రాట్నం’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చర్చ జరిగింది. అందులో భాగంగా ఇలా చెప్పుకొచ్చారు. “సాధారణంగా సీమంతం పుట్టబోయే బిడ్డ బాగుండాలని జరుపుకుంటారు. ఈ పాటలో పుట్టబోయే బిడ్డని రాబోయే తరంతో పొలుస్తున్నారని తెలిపారు. వచ్చే తరం కూడా అవినీతిలో ఉంటుందని, ఆరని రావణకాష్టంలో వచ్చే తరాలు కూడా ఆహుతు అవుతున్నాయి” అని వివరించారు.

watch video :

Also Read: ANNI MANCHI SAKUNAMULE REVIEW : “సంతోష్ శోభన్, మాళవిక నాయర్” నటించిన అన్నీ మంచి శకునములే హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!