Ads
హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మీడియాకి దూరంగా ఉండిపోయిన సమంత.. తన కొత్త మూవీ ‘యశోద’ ప్రమోషన్స్‌లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో ఆమె అమెరికాలో సర్జరీ చేయించుకుందని వార్తలు కూడా వచ్చాయి.
Video Advertisement
అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ తనకి ‘మయోసైటిస్’వ్యాధి ఉన్నట్లు సమంత ప్రకటించింది. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది. సమంత ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ కోరుకుంటూ ట్వీట్స్ చేశారు.
అయితే అసలు ఏంటి ఈ ‘మయోసైటిస్’ వ్యాధి? అంత ప్రమాదకరమా? అంటూ నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. దీంతో కొందరు వైదులు దీనిపై స్పందించారు.
ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది. అందులో సమంతకు వచ్చిన వ్యాధి ఏ రకమో ఆమె తెలుపలేదు.
మయోసైటిస్ లో చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా వచ్చేవాటిలో పాలిమయోసైటిస్ ఒకటి. ఇది వచ్చినవారికి కండరాల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలిసిపోతారు. కొంత దూరం నడిస్తే ఆయాసపడతారు.. అంతే కాదు ఒక్కోసారి తెలియకుండానే కింద పడిపోతారు.
ఇక మరో రకం డెర్మటోమయోసైటిస్. దీని వల్ల వాపు కూడా ఉంటుంది. పిల్లలు మహిళల్లో దీని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చర్మంపై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వారిని చాలా ఇబ్బంది పెడతాయంటున్నారు డాక్టర్లు.
ఇక మూడో రకం ఇన్ క్లూజన్ బాడీ మయోసైటిస్ దీని వల్ల భుజాలు, నడుము, తొడ కండరాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ముంజేతి, మోకాలి కండరాలు ఈ వ్యాధి వల్ల ప్రభావితం అవుతాయి. అవి పట్టేస్తాయి.. బాగా నొప్పి కూడా ఉంటుంది. దీని వల్ల వ్యాధిగ్రస్తులు బాగా నీరసానికి గురవుతారు. ఇది ఎక్కువగా 50 ఏళ్ళు దాటినవారికి సంక్రమిస్తుంది.
ఈ ‘మయోసైటిస్’ వ్యాధిని గుర్తించడమే చాలా కష్టమైని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి కొంత మందికి వంశపారంపర్యంగా వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. మరికొందరికి స్టెరాయిడ్స్ తీసుకోవడంతో వచ్చినట్లు కూడా తేలింది. కొన్ని కేసుల్లో కొన్ని మందుల వాడటం ద్వారా వచ్చినట్లు తేలిందని వైద్యులు చెప్తున్నారు.
ఈ వ్యాధికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఉపశమనానికి మందులు మాత్రమే ఉన్నాయి. అంతే కాదు ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరు వీల్ చైర్ కు పరిమితం అవ్వవచ్చు.. లేదా మంచానికే పరిమితం అవ్వొచ్చు.
కాని తమ జీవన శైలిలో మార్పులు, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు ఎక్కువ కాలం జీవించేలా కాపాడతాయి. ఇవన్నీ పాటించకపోతే 5 ఏళ్ళలోపే పేషంట్ మరణించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమంత యంగ్ ఏజ్ లోనే ఉంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ.. మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా సమంత ఫుల్ ఫిట్ గా ఉంటుందన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ విషయాన్నే ఆమె కూడా వెల్లడించారు. నేను చాలా వరకూ కోలుకున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు సమంత. ఏదేమైనా సమంత త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
End of Article