Ads
ఏవైనా వరుసగా కొన్ని సినిమాలు గమనిస్తే, ఎక్కువగా లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ మూవీలు, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసి చివరిలో ఎమోషనల్ సీన్స్ తో ఒప్పించడాలు ఇవే కామన్ గా చూస్తుంటాం. కాకపోతే కాన్సెప్ట్స్ ఎంత కామన్ గా ఉన్నా, అందులో సీన్స్, కామిడీ, తీసే విధానాన్ని బట్టి ప్రేక్షకులు చూస్తుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఇద్దరు హీరోయిన్లు ఉండటం మరీ కామన్, కాన్సెప్ట్స్ మాత్రం సేమ్ ఉండటం మరీ కామన్ అన్నమాట.
Video Advertisement
అయినప్పటికీ అందులో కొన్ని సినిమాలు హిట్ కాకపోయినా ఓ మోస్తరుగా ఆడటానికి, కారణం అందులోని హీరో , హీరోయిన్, పాటలు, డ్యాన్సులు ఏవైనా కావొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలం సినిమాలు చూస్తే ఈ మూడు సినిమాలలో ఉన్న కామన్ కాన్సెప్ట్ ఏంటి అంటే హీరో గవర్నమెంట్ ఎంప్లాయిగా పని చెయ్యడం. అయితే కథలు కొంత వేరేలా ఉన్నా కూడా, మెయిన్ థీమ్ మాత్రం సమాజాన్ని బాగుపరచడమే. ఈ సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అయినప్పటికీ, సినిమాలు మాత్రం అనుకున్నంత హిట్ ఇవ్వలేక పోయాయి. అసలు ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏవో? ఎవరివో ఓ లుక్కేద్దాం.
ఇవి కూడా చదవండి: గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్స్…ఎవరెవరు ఏ హోదాలో అంటే.?
1. రిపబ్లిక్
దేవ కట్ట దర్శకత్వం వహించిన, సాయ్ ధరమ్ తేజ్ మూవీ రిపబ్లిక్ లో హీరో ఐఐటీ జాబ్ ఇష్టం లేక, ఐఏఎస్ ఆఫీసర్ గా మారి కరప్షన్ ని నిర్మూలించాలి అనుకుంటాడు. కాగా ఈ సినిమా కాన్సెప్ట్ కానీ, కథ కానీ చాలా బాగుంది అనే టాక్ రావడంతో, ఎలాంటి హంగులూ, ఆర్భాటాలు లేకుండా రిపబ్లిక్ సినిమా సైలెంట్ హిట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇలా హీరో గవర్నమెంట్ ఎంప్లాయ్ గా పని చేసిన ఈ సినిమా క్లిక్ అయ్యిందనే అనొచ్చు.
2. రామారావ్ ఆన్ డ్యూటీ
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, శరత్ మండవ తెరకెక్కించిన మాస్ మహరాజ రవితేజ సినిమా రమా రావ్ ఆన్ డ్యూటీలో, హీరో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఇందులో హీరో ఏదైనా తప్పు జరిగితే, రూల్స్ ను కూడా బ్రేక్ చేసి మరీ రాంగ్ ను రైట్ చేస్తాడు. కాకపోతే ఈ సినిమా ఊహించినంత ఆడకపోగా, రవితేజ అభిమానులను నిరాశ పరిచింది. ఇప్పటికీ గత కొంత కాలంగా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించినప్పటికీ, ఈ కాన్సెప్ట్ మాస్ మహారాజా కి అంతగా సెట్ అయునట్లు లేదు అంటున్నారు పలువురు సినీ అభిమానులు.
ఇవి కూడా చదవండి: మొన్న RRR… ఇప్పుడు విక్రమ్..! “మహేష్ బాబు” కి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది..?
3. మాచర్ల నియోజకవర్గం
యం.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రీకరించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఇందులో నితిన్ ఒక జిల్లాకు కలెక్టర్ గా ఎంపిక అయ్యి, అక్క ఉన్న రౌడీ పొలిటీషియన్ ను, జిల్లాలో ఉండే సమస్యలను చక్కదిద్దుతాడు. కాగా ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ఆశలు పెట్టుకుంటే అవన్నీ అడియాశలు అయిపోయాయి. రాను రాను పాట మంచి హిట్ ఇచ్చినప్పటికీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. దీంతో అభిమానులు కొంత బాధ పడ్డా, హీరో నితిన్ ను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూసి ఆనందపడ్డారు.
4. టక్ జగదీష్
శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన నాని సినిమా టక్ జగదీష్ లో హీరో ఏమ్ఆర్ఓ(MRO) గా పనిచేస్తాడు. అయితే మిగతా సినిమాలతో ఈ సినిమా కాస్త భిన్నం ఎందుకంటే, ఈ సినిమాలో కూడా హీరో గవర్నమెంట్ ఉద్యోగే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో కాదు. ఊరిలో ఉన్న ల్యాండ్ గొడవలను సరి చేస్తూ అందరినీ కలపడానికి ప్రయతించే సినిమా టక్ జగదీష్. కానీ ఈ సినిమా బెడిసికొట్టింది. అనుకున్నట్టు ఆడకపోవడంతో, సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఏదేమైనప్పటికీ ఈ నాలుగు సినిమాలు గమనిస్తే, హీరోలు గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా పనిచెయ్యడం విశేషం. అవి హిట్ అయినా ఫట్ అయినా, సినీ అభిమానులు మాత్రం, కొత్త పాత్రలను పోషిస్తున్నందుకు, హీరోలను మెచ్చుకుంటున్నారు. ఏదైనా తప్పును సరి చెయ్యాలి అంటే చట్టపరంగా, న్యాయంగా చెయ్యాలి అనే మెసేజ్ కూడా ఇచ్చినట్టు అయ్యింది అని అభప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి: మహేష్ నుండి మృణాల్ వరకు…ఈ 7 మంది హీరో/హీరోయిన్లను “వైజయంతి మూవీస్” పరిచయం చేసిందని తెలుసా.?
End of Article