Ads
సినీ ఇండస్ట్రీ ఎంత రంగుల ప్రపంచమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై నటీనటుల్ని చూసి వారికీ అసలు ఏ సమస్యలు ఉండవేమో అనుకుంటారు అంతా.. కానీ వారు కూడా మనలాగా మనుషులే. వారికీ ఎన్నో బాధలుంటాయి అని ఇటీవల సమంత తన ఆరోగ్యం గురించి చెప్పినపుడు తెలిసింది. అది ఎంత ప్రాణాంతక వ్యాధో తెలిసి అందరు చాలా బాధ పడ్డారు. ఇప్పుడు అలాగే డైరెక్టర్ కె వి అనుదీప్ కి కూడా ఒక అరుదైన ఆరోగ్య సమస్య ఉంది అని తెలిపారు. అదేంటో చూద్దాం..
Video Advertisement
జాతిరత్నాలు డైరెక్టర్ కె వి అనుదీప్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేసిన ‘ప్రిన్స్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ నేపథ్యం లో డైరెక్టర్ అనుదీప్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తాను “హైలీ సెన్సిటివ్ పర్సన్ డిసార్డర్” తో బాధ పడుతున్నట్లు తెలిపాడు అనుదీప్.
“మనలో చాలా మందికి ఈ ప్రాబ్లెమ్ ఉంటుంది కానీ ఇది అని ఎవరు గుర్తించలేరు. నాలో కొన్ని మార్పుల వాళ్ళ నేను గుర్తించి తెలుసుకోగలిగాను. నాకు గ్లూటెన్ పడదు. కాఫీ కూడా పడదు. ఏదైనా జ్యూస్ తాగితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతే కాకుండా ఈ డిసార్డర్ ఉంటే సెన్సెస్ చాలా ఎక్కువగా పని చేస్తాయి. దీంతో ఎక్కువ శబ్దాలు వచ్చిన.. ఎక్కువ లైటింగ్ వచ్చినా..ఇబ్బంది పడతారు. త్వరగా అలసి పోతయారు. అందుకే నాకు కొన్ని సార్లు షూటింగ్ లో కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది.” అని అనుదీప్ వెల్లడించారు.
త్వరలో ఈ డిసార్డర్ బేస్ చేసుకొని ఒక సినిమా తీస్తానని..దాని వాళ్ళ కొందరైనా హీల్ అవుతారని అనుదీప్ పేర్కొన్నారు.
End of Article