సాయి పల్లవి, నాగ చైతన్య జంట గా నటిస్తున్న సినిమా “లవ్ స్టోరీ ” నుంచి సారంగ దరియా పాట రిలీజ్ అయ్యాక ఎంత విజయం సాధించిందో తెలిసిందే. ఈ పాట మొదట్లో కొంత వివాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ.. ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల కలుగచేసుకుని వివాదాన్ని సద్దుమణిచారు.

sarangadhariya

సారంగదరియ జానపద గీతం అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ.. సారంగ దరియా అన్న పదానికి అర్ధం మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి సారంగ దరియా పురుష లింగ పదం సారంగ ధరుడికి స్త్రీ లింగ పదం. ఈ విషయాన్ని సుద్దాల అశోక్ తేజ గారు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. సారంగ ధరుడు అంటే సారంగ వాయిద్యాన్ని వాయించే వాడు అన్న అర్ధాన్ని సుద్దాల అశోక్ తేజ గారు చెప్పారు.

sarangadhariya 1

నిజానికి ఆ వాయిద్యం పేరు సారంగి. దానిని సారంగ అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈ అర్ధం కంటే మరొక అర్ధం ఈ పదానికి ఇంపుగా ఉంటుంది. సారంగ దరుడు అంటే
లేడిని చేత ధరించిన వాడు అని అర్ధం. ఆ పేరు ఒక్క శివుడికే ఉంది. శివుడిని సారంగ ధరుడు అంటారు. పై ఫోటో లోని శివుడిని గమనిస్తే ఆయన చేతిలో లేడి కనిపిస్తుంది. ఈ శిల్పం బ్రిటిష్ మ్యూజియంలో ఉంటుంది.

sarangadhariya 3

సారంగ ధరుడు అనే పదానికి స్త్రీలింగం లో సారంగ ధరి అని పేరు. తెలుగు వాచక శబ్దాలకు “య” కారాన్ని కలిపి వాడడం ఎప్పటినుంచో వస్తోంది. (సఖి- సఖియా, చెలి-చెలియా) అలా.. సారంగ ధరి కాస్తా సారంగ ధరియ అయ్యింది. సారంగధరుడు శివుడు కాబట్టి.. సారంగధరి లేదా సారంగధరియ అంటే పార్వతి దేవి అని అర్ధం.