Ads
ప్రస్తుతం ఈ సంవత్సరం ఐపీఎల్ నడుస్తోంది. కప్ ఏ జట్టు గెలుస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, గుజరాత్ టైటాన్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరుగుతోంది.
Video Advertisement
ఇదిలా ఉండగా డాట్ బాల్స్ చూపిస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఒక గ్రీన్ కలర్ ఓ (O) అక్షరం కనిపిస్తోంది. అలాగే డాట్ బాల్స్ చూపించేటప్పుడు బాల్స్ బదులు చెట్టు సింబల్ చూపిస్తున్నారు. ఇది చూసిన చాలా మంది దీని వెనుక కథ ఏంటి అనుకుంటున్నారు.
అసలు విషయం ఏంటంటే బీసీసీఐ సంస్థ ఈ సంవత్సరం జరిగే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లలో బౌల్ చేసిన ఒక్కొక్క డాట్ బాల్ కి 500 చెట్లని నాటుతోంది. అందుకే దానికి సంకేతంగా ఇలా చెట్టు బొమ్మని చూపిస్తున్నారు. ఇది తెలుసుకున్న చాలామంది బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో 15 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.
మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 172 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ జట్టు 157 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. గుజరాత్ జట్టుని చెన్నై ఓడించడం ఇదే మొదటి సారి. గతంలో గుజరాత్ చేతిలో చెన్నై మూడుసార్లు ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఓడిపోయినా కూడా ఫైనల్ కి చేరెందుకు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడడం ద్వారా మరొక ఛాన్స్ దక్కించుకుంది.
అయితే ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ పై ఎన్నో రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ధోనికి, అంపైర్లకి మధ్య జరిగిన చర్చ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ చర్చ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వైరల్ టాపిక్ గా మారింది. కొంత మంది ధోనికి మద్దతుగా మాట్లాడుతుంటే, కొంత మంది అలా ఎందుకు జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఇవాళ లక్నో సూపర్ జైయింట్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది.
End of Article