Ads
గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్నను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు. ఆమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రేజ్ తో పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా సైన్ చేసింది రష్మిక. ప్రెజెంట్ ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
Video Advertisement
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈమెపై గత కొన్ని రోజుల నుండి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఈమె పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ట్రోల్ల్స్ పై స్పందించడానికి కారణమేంటి అంటే.. ఆమె కాంతార సినిమా చూడకపోవడమే అని తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కాంతార ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. కాంతార సినిమాలో హీరో కమ్ దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రతిభకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సెప్టెంబరు చివరి వారం నుంచి కాంతార రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే రష్మిక ఇటీవల విమానాశ్రయంలోకి వెళ్తుండగా.. మీడియా సభ్యులు కాంతార మూవీని చూశారా? అని అడిగారు. దానికి ఆమె ‘ఇంకా చూడలేదు’ అని సమాధానం ఇచ్చింది.
దాంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. ‘కిరిక్ పార్టీ’తో నీకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన మూవీ.. అది కూడా దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న కాంతారాని నువ్వు చూడలేదా? స్టార్ డమ్ అంత తలకెక్కిందా? నీ మూలాల్ని మర్చిపోయావా? ఇలా ట్రోలర్స్ పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు గుప్పించారు. అలానే రక్షిత్ శెట్టితో ప్రేమ వ్యవహారం కూడా ట్రోలర్స్ తెరపైకి తెచ్చారు. దాంతో రష్మిక ఎమోషనల్ అయిపోయింది. ట్రోలింగ్ తనని చాలా బాధపెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
రష్మిక కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’తో 2016లో వెండితెరకి పరిచయం అయ్యింది. ఆ మూవీలో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. అతని స్నేహితుడు రిషబ్ శెట్టి డైరెక్టర్. ఆ సినిమా హిట్ కావడంతో రష్మిక కెరీర్ ఊపందుకుంది. తెలుగులో ‘ఛలో’లో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఇక ‘పుష్ప’ సినిమాతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యం లో ను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను ఎగతాళి చేస్తూ ట్రోల్ చేయడంతో నా హృదయం ముక్కలైంది అంటూ బాధపడింది. వాస్తవానికి ఇలాంటి ట్రోలింగ్ పట్టించుకోకూడదని అనుకున్నా.. కానీ పరిస్థితి మరింత దిగజారడంతో తప్పడం లేదంటూ రష్మిక రాసుకొచ్చింది.
End of Article