Ads
‘రూమర్లు, రూమర్లు, రిప్ రూమర్లు’ అంటూ నటి, నిర్మాత అయిన ఛార్మి కౌర్ చేసిన తాజా ట్వీట్ దుమారం రేపుతోంది. అసలు ఛార్మి ఈ ట్వీట్ ఎందుకు పెట్టింది..? ఎవర్ని ఉద్దేశించి పెట్టింది..? అసలు ఈ ట్వీట్ వెనుక అర్థం ఏంటి..? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Video Advertisement
నీ తోడు కావాలి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఛార్మీ అటు తర్వాత చాలా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన ఛార్మీ మంత్ర, గౌరి వంటి పలు హిట్ సినిమాల్లో కూడా నటించింది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఈమె చేసినవి అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలు. దీంతో ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత బుడ్డా హోగా తేరా బాప్(హిందీ), జ్యోతి లక్ష్మి వంటి చిత్రాలలో నటించి దర్శకుడు పూరి జగన్నాథ్ కు దగ్గరైంది. అప్పటి నుండీ వీళ్లిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ ( పిసి) అనే బ్యానర్ ను స్థాపించి సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యింది. కానీ రీసెంట్ గా చేసిన లైగర్ పెద్ద డిజాస్టర్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఛార్మి నాలుగు రోజుల క్రితం ఒక ట్వీట్ చేసారు. ‘ అబ్బాయిలూ.. పూరి కనెక్ట్స్ సంస్థ త్వరలోనే ధృడంగా తిరిగి రాబోతుంది.’ అని ఆ ట్వీట్ సారాంశం. దీంతో ‘లైగర్’ చిత్ర పరాజయంతో చిత్ర నిర్మాణ బృందానికి, ఛార్మికి విబేధాలు వచ్చాయంటూ, ఆమె ప్రకటించిన ‘జనగణమన’ చిత్రం ఆగిపోయిందంటూ పుకార్లు ఊపందుకున్నాయి. ఈ మధ్యనే పూరి కనెక్ట్స్ అఫిషియల్ సోషల్ మీడియా ఖాతా కొన్నాళ్ళు ఆఫ్ లైన్ కు వెళ్ళబోతున్నట్టు ప్రకటించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్టు అయ్యింది.
వీటికి చెక్ పెట్టేందుకు ఛార్మి స్పందించింది. రిప్ రూమర్లు అంటూ చెప్పి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల పై దృష్టి పెట్టినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
End of Article