ఈ ఏడాది మలయాళంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ రోమాంచం. ఈ చిత్రాన్ని రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. టోటల్ రన్ లో 42 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 69 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ హిట్ గా నిలిచింది.
Video Advertisement
తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ విడుదల అయ్యింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ హిట్ అవడంతో ఇతర భాషా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూశారు. ఈ మూవీ దక్షిణాది భాషల్లో డబ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీలో ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. టేక్ ఆఫ్ కి 30 నిముషాల సమయం పట్టగా, ఆ తర్వాత స్టోరిలో ఇంట్లోవారు ఒక ఆత్మని పిలవడం జరుగుతుంది.
ముందు ఏదో అనుకున్నప్పటికి, ఆ ఆత్మ ఊహించని ప్రశ్నలకు కూడా జవాబు చెప్తుంది. అంతేకాకుండా ఆ ఆత్మ ఇంట్లో వారిలో ఒక్కరి ప్రాణం కావాలనుకుంటోందని తెలుస్తుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగింది అనేదే ఈ చిత్రం. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించింది. అయితే సెకెండ్ ఆఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. ఆ తరువాత క్లైమాక్స్ కు ముందు కాసేపు బాగుంటుంది.
అయితే సినిమాకి ముగింపు ఇవ్వలేదు. ఏం జరిగిందో పార్ట్ 2 లో చూడండి అన్నట్టు చెప్పడంతో ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లేదని చెప్పవచ్చు. థియేటర్స్ లో జనాల మధ్యన కూర్చుని చూసినపుడు కొన్ని సన్నివేశాలకి నవ్వుకునే అవకాశం ఉంటుంది. ఓటీటీలో చూసినపుడు మాత్రం అలాంటి అనుభూతి అయితే రాలేదు.