ముందు OTT అనుకున్న సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది..! అసలు ఏం ఉంది ఇందులో..?

ముందు OTT అనుకున్న సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది..! అసలు ఏం ఉంది ఇందులో..?

by kavitha

తెలుగు ఓటిటి సంస్థ ఆహా నుండి గ్రామీణ నేపధ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం ఇంటింటి రామాయణం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సీనియర్ నరేష్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Video Advertisement

  • చిత్రం : ఇంటింటి రామాయణం
  • నటీనటులు : నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి.
  • నిర్మాత : వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి
  • దర్శకత్వం : సురేష్ నరెడ్ల
  • సంగీతం : కళ్యాణి మాలిక్
  • విడుదల తేదీ : జూన్ 9, 2023

intinti-ramayanam-movie-review-1స్టోరీ :

మంచి మనస్తత్వం కలిగిన రాములు (నరేష్) తోటివారికి వీలైనంత సాయం చేస్తూ జీవిస్తుంటాడు. రాములు కుమార్తె సంధ్య (నవ్య స్వామి),  శ్రీనివాస్ (రాహుల్ రామకృష్ణ) ప్రేమించుకుంటారు. అలా సాగుతున్న కథలో ఒకరోజు  రాములు ఇంట్లో దొంగతనం జరుగుతుంది.
అది ముఖ్యమైనది కావడంతో ఇంట్లో ఉన్న అందరిని అనుమానిస్తు ఉంటారు. చివరికి కూతురు ప్రేమించిన శ్రీనివాస్ ని అనుమానిస్తారు. అసలు దొంగతనం అయిన వస్తువు ఏమిటి? ఇంతకీ దొంగ ఎవరు, పోయిన వస్తువు తిరిగి దొరికిందా, ఆపైన ఆ తరువాత ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా మారాయి అనేది తెలియాలి అంటే ఇంటింటి రామాయణం చూడాల్సిందే.
రివ్యూ :

దర్శకుడు సింపుల్ కథను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. కథ  చెప్పే విధానం క్యారెక్టర్ల పరిచయం చేయడం చక్కగా ఉంది. దర్శకుడు ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ ని ఎక్కువ ల్యాగ్ బాగా లేకుండా సాగుతుంది. తెలంగాణ స్లాంగ్  డైలాగ్స్, డీసెంట్ కామెడీతో ఆడియన్స్ ని అలరిస్తాయి. ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కాస్త సాగతీతగా, బోర్ గా అనిపిస్తాయి. మరింత ఎమోషన్ ఉంటే ఈ మూవీ మరో లెవెల్ ఉండేది.
ఈ మూవీలోని రాములు క్యారెక్టర్ సీనియర్ నరేష్ మరొకసారి అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం నరేష్ పాత్ర యొక్క తీరు ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ తన పాత్రలో బాగా నటించారు. నవ్య స్వామి ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, చేవెళ్ల రవి, అంజి,  జీవన్ తదితరులు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. మూవీలో ఉన్న 3 సాంగ్స్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :

  • సీనియర్ నరేష్ నటన,
  • స్క్రీన్ ప్లే,
  • స్టోరీ నరేషన్
  • పాటలు,

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో కాస్త సాగతీత,
  • ఊహకు తగ్గట్టు సాగే కొన్ని సీన్స్,

రేటింగ్ : 2.75/5

ట్యాగ్ లైన్ : సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు మినహా ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా ఇంటింటి రామాయణం..

watch trailer :


You may also like