మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరుని పొందారు. పైగా ఆడియన్స్ కి కూడా చాలా దగ్గరయ్యారు. క్రాక్ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. పైగా రవితేజ కి హేటర్స్ ఎక్కువగా ఉండరు. ఎక్కువ హేటర్స్ లేని హీరోలలో రవితేజ కూడా ఒకరు.

Video Advertisement

రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలతో ఫ్లాపులు అందుకున్నప్పటికీ కూడా ఆయన స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇప్పడు రవి తేజ ధమాకా సినిమా విడుదల కావలసి వుంది. ఈ సినిమా కోసం పెద్దగా బజ్ అయితే ఏమి లేదు. ఆశించిన స్థాయిలో ఫలితం వచ్చేలా ఏమి లేదు. తాజాగా ఈ సినిమా పాటలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి పబ్లిసిటీ చేసి ఆ తర్వాత డిసెంబర్ 23న విడుదల అయితే కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోవచ్చు. పైగా హిట్ 2 కి పోటీగా దీనిని విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రవితేజ చిరు కాంబినేషన్లో సీన్స్ కూడా పూర్తి చేసుకుంటున్నారు.

5 raviteja

అలానే రావణాసుర, ఈగల్ సినిమాలు కూడా షూటింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒప్పుకున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా అవుతోంది. ఇవి ఇలా ఉంటే ధమాకా, వాల్తేరు పేరయ్య సినిమాలకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంది. ఈవెంట్లలో కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే సినిమా హిట్ అయిన హిట్ కాకపోయినా సరే వరుస సినిమాలతో రవితేజ ఈతరం హీరోల లాగ బిజీ అయిపోయారు. ఈ విషయంలో రవితేజ చేస్తోంది కరెక్ట్ ఏనా..? ఏది ఏమైనా వరుస సినిమాలతో ఏ మాత్రం స్పీడ్ ని తగ్గించేయకుండా జోరుగానే కొనసాగుతున్నారు రవితేజ. మరి రాబోయే సినిమాలతో రవితేజ ఎంత ఇంప్రెస్ చేస్తారనేది చూడాల్సి ఉంది.