“రంగస్థలం” తో ఫేమస్ అయిన ఈ 3 సింగర్స్… ఇపుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

“రంగస్థలం” తో ఫేమస్ అయిన ఈ 3 సింగర్స్… ఇపుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

by kavitha

Ads

సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కిన ఆల్ టైం హిట్ చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా 2018లో మార్చి 30న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాలు లేవు. అయితే విడుదల అయ్యాక తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో భారీగా వసూళ్లు సాధించింది.

Video Advertisement

వినికిడి సమస్య ఉన్న చిట్టిబాబుగా హీరో రాంచరణ్ యాక్టింగ్ ఈ చిత్రానికే హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ గుర్తింపు, ప్రశంసలు లభించాయి. దేవిశ్రీ సమకూర్చిన సంగీతం కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇందులోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్ర పాటల ద్వారా ముగ్గురు ఫోక్ సింగర్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
rangasthalam-singersఈ సినిమా విజయం సాధించడంతో ఆ సింగర్స్ కి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. వారు ఈ సినిమా కన్నా ముందు బుల్లితెర పై ప్రసారం అయిన ‘రేలారే రేలా’ప్రోగ్రామ్ లో పాటలు పాడారు. రంగస్థలం సినిమా తరువాత వారు వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని అంతా అనుకున్నారు. మరి ఏమయ్యిందో తెలియదు కానీ ఆ తరువాత ఆ సింగర్స్ ఎ సినిమాలోనూ పాడలేదు. వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారనేది చాలామందికి తెలియదు. అయితే ఆ సింగర్స్ ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

1.రేల కుమార్:
రేల కుమార్ వరంగల్ జిల్లాకు చెందిన గాయకుడు. మా టీవి లో ప్రసారం అయిన ‘రేలారే రేలా’ ప్రోగ్రామ్ ద్వారా సింగర్ గా పరిచయమయ్యాడు. రంగస్థలం సినిమాలో ‘జిగేలు రాణి పాట’ పాడి టాలీవుడ్ కి పరిచయమయ్యాడు.అయితే ఆ సినిమా తరువాత వేరే సినిమాలలో పాడలేదు. 2019 లో కరోనా నేపద్యంలో ఒక పాటను ఆలపించారు.


2. గంటా వెంకట లక్ష్మి:

వెంకట లక్ష్మి బుర్ర కథ, జానపద గేయాలను పాడే సింగర్. ఆమె పడిన పాటలను యూట్యూబ్ లో చూసిన సుకుమార్, దేవిశ్రీ రంగస్థలం సినిమాలోని జిగేలు రాణి పాటకు ఎంపిక చేశారు.ఆమె పాడిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ తరువాత ఆమె సినిమాలకు పని చేయలేదు.ఇటీవల కొన్ని టెలివిజన్ షోలలో కనిపిస్తున్నారు.

To Watch Video : Click On WATCH ON YOUTUBE


3. రేల శివ నాగులు:

తెలంగాణ ఫోక్ సింగర్ అయిన శివ నాగులు రంగస్థలం సినిమాలోని ‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా’ అనే పాటను అందించారు. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. ఆడియో ఈవెంట్ లో కూడా ఆయనను వేదికపైకి పిలిచి,ఆ పాటను పాడించారు.ఆ పాత కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ శివ నాగులు సినిమాలకు పాడలేదు.

 

Also Read: “మహేష్ బాబు – త్రివిక్రమ్” సినిమాకి, “వీర సింహా రెడ్డి” కి ఉన్న సంబంధం ఇదేనా..? ఈ ప్రయోగం వర్కౌట్ అవుతుందా..?


End of Article

You may also like