మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇనింగ్స్ షురూ చేసాక వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వున్నాయి.

Video Advertisement

మాస్ లుక్ తో చిరంజీవి సినిమాలో నటిస్తే ఫ్యాన్స్ కి పండుగే సందేహమే లేదు. చిరు గోదావరి యాస లో మాట్లాడుతున్నారు చిరు ఈ సినిమాలో.

మహారాజా రవి తేజ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారు. చిరంజీవి 154వ సినిమా ఇది. మరి ఎంతలా ఆకట్టుకుంటారో చూడాల్సి వుంది. వాల్తేరు వీరయ్య లోని బాస్ పార్టీ పాట బాగా హిట్ అవుతోంది. పైగా దీన్ని సినిమా ప్రచారం కోసం కూడా ఉపయోగించేస్తున్నారు. అలానే బాలయ్య వీరసింహారెడ్డి సినిమా కోసం కూడా అంతా చూస్తున్నారు. ఈ సినిమా లోని మా బావ మనో భావాలు పాట విడుదల అయ్యింది. అయితే ఈ పాట కూడా బాగా హిట్ అయ్యే సందేహాలు కనపడుతున్నాయి. బాలకృష్ణ, ఐటమ్ బాంబ్ చంద్రికా రవి ఈ పాటకి డాన్స్ వేశారు.

తమన్ నుండి మరో సూపర్ పాట ఇది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. పాట కొరియోగ్రఫీ కూడా సూపర్ గా వుంది. మరి ఈ రెండు పాటల్లో ఏది బాగా హిట్ అవుతుందో చూడాల్సి వుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌టానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. వర లక్ష్మి శరత్‌ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు చేస్తున్నారు.