“ఫిబ్రవరి” లో రిలీజ్ అయిన ఈ 3 సినిమాల్లో… ఏది హిట్..? ఏది ఫ్లాప్..?

“ఫిబ్రవరి” లో రిలీజ్ అయిన ఈ 3 సినిమాల్లో… ఏది హిట్..? ఏది ఫ్లాప్..?

by Anudeep

Ads

గత వారం థియేటర్లలో మూడు కాన్సెప్టు ఓరియెంటెండ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అవి సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’, సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ ,అనిక సురేంద్రన్, అర్జున్ దాస్ కీలకపాత్రల్లో నటించిన ‘బుట్టబొమ్మ’. ఈ మూడు చిత్రాల్లో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మిగతా రెండు చిత్రాలకు నెగటివ్ టాక్ వచ్చింది.

Video Advertisement

సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మైఖేల్’. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాతో సందీప్ కిషన్ కమ్ బ్యాక్ హిట్ కొడతారని అందరూ ఆశించగా.. తొలి ఆట నుంచే టాక్ ఘోరంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . ఈ చిత్రం లో గౌతమ్ మీనన్, అనసూయ, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ అయింది. కానీ ఒక్క చోట కూడా సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు.

which movie is hit from this week releases..!!

అలాగే అర్జున్‌దాస్‌, అనిఖా సురేంద్ర‌న్‌, సూర్య వ‌శిష్ట ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ‘బుట్టబొమ్మ’ చిత్రానికి శౌరి చంద్ర‌శేఖ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన క‌ప్పేలా సినిమా ఆధారంగా అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసింది. కానీ మ‌ల‌యాళ రిజ‌ల్ట్‌ తెలుగులో మాత్రం రిపీట్ కాలేదు. మినిమం వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్ట‌లేక డిజాస్ట‌ర్‌గా బుట్ట‌బొమ్మ‌ మిగిలిపోయింది.

which movie is hit from this week releases..!!

ఇక సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ష‌ణ్ముఖ్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌కుడు. ఓ ర‌చ‌యిత జీవితంలో ఎదురైన స‌ర‌దా సంఘ‌ట‌న‌ల‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. సుహాస్ కు జోడీగా టీనా శిల్పరాజ్ నటించారు. ఈ చిత్రంలో పద్మభూషణ్ అనే మధ్యతరగతి యువకుడిగా సుహాస్ కనిపించగా, ఆశిష్ విద్యార్థి, రోహిణి అతని తల్లిదండ్రులుగా నటించారు. ఈ మూడు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద రైటర్ పద్మభూషన్ పర్వాలేదనిపిస్తోంది. తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ .5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం సుహాస్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్లను నమోదు చేసింది.


End of Article

You may also like