షుగర్ ఉందా..?? బెల్లం.. తేనే.. ఏది మంచిది..?? తెలుసుకోండి..!!

షుగర్ ఉందా..?? బెల్లం.. తేనే.. ఏది మంచిది..?? తెలుసుకోండి..!!

by Anudeep

Ads

మధుమేహం అనేది గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మరియు ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న అటువంటి వ్యాధి. 1980 సంవత్సరంలో, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 108 మిలియన్లు, ఇది 2014 నాటికి 422 మిలియన్లకు పెరిగింది. ఈ వ్యాధి పైకి కనిపించదు కానీ అంతర్గతం గా శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.

Video Advertisement

 

షుగర్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. ఇందులో ముఖ్యంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ పాటించకపోవడం వంటి వాటి వల్ల సమస్య వస్తుంది.

which is the alternative sweetner for diabetic patients..

షుగర్ శరీరంలోని అనేక భాగాలకు హాని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం, అంధత్వం వంటి సమస్యలు ఎదురవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడం మొదటి పని. షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో నియంత్రణ అవసరం. ఆహారాన్ని నియంత్రించడానికి, తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి.

which is the alternative sweetner for diabetic patients..

అయితే చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు పంచదారకు ప్రత్యామ్నాయం గా బెల్లం, తేనే లను ఎంచుకుంటారు. బెల్లం కూడా షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని, దీని బదులు తేనె తీసుకోవడం ఓ రకంగా మంచిదని అంటున్నారు వైద్యులు. అయితే ఇదికూడా తగిన మోతాదులోనే. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం ఉన్నప్పటికీ అది షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

which is the alternative sweetner for diabetic patients..

పంచదార, బెల్లం రెండింట్లోనూ గ్లైసోమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు మంచిది కాదు. డయాబెటిక్ పేషెంట్లు తీపి ఆహారం కోసం తృష్ణను నియంత్రించడానికి బెల్లం తీసుకుంటారు. కానీ 10 గ్రాముల బెల్లంలో 65% నుండి 85% సుక్రోజ్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు తీపి కోసం మార్కెట్లో దొరికే ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్‌ని వాడుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్స్. వీటి వల్ల ఆరోగ్యానికి అంతగా ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు.

which is the alternative sweetner for diabetic patients..

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఆచితూచి డైట్ ఎంపిక చేసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. సీజనల్ ఫ్రూట్స్‌ని కూడా తగ్గించడం చాలా మంచిది. మామిడిపండ్లు, సీతాఫలాలు, అరటిపండ్లు, సపోటా ఇవన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లు వీటిని తింటే షుగర్ అమాంతం పెరుగుతుంది.

which is the alternative sweetner for diabetic patients..

రైస్‌కి బదులు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ తీసుకోవడం, నీటిని తీసుకోవడం చాలా మంచిది. రోజుకి కనీసం రెండున్నర లీటర్ల నీరు తాగడం మంచిది. ఇలాంటివి చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల షుగర్ దాదాపు కంట్రోల్ అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.


End of Article

You may also like