ఆ ఒక్క ఫ్లాప్ ఈ డైరెక్టర్ల కెరీర్ మీద బాగా దెబ్బకొట్టిందా.?

ఆ ఒక్క ఫ్లాప్ ఈ డైరెక్టర్ల కెరీర్ మీద బాగా దెబ్బకొట్టిందా.?

by Sunku Sravan

ఈ రంగుల సినిమా ప్రపంచంలో నటీనటులు కానీ, డైరెక్టర్లు కానీ, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పుడు పోటీ పడుతూనే ఉండాలి. వరసగా హిట్లు వచ్చిన ఒక్క ఫ్లాప్ వస్తే మాత్రం డైరెక్టర్ల పరిస్థితి చాలా మారిపోతుంది. అయితే డైరెక్టర్లు అనేవారు విజయం సాధిస్తేనే అటు హీరోల మనసులో కానీ, ఇటు నిర్మాతల మనసులో కానీ ఎప్పుడూ చోటు ఉంటుంది.

Video Advertisement

అలాంటి వారితో హీరోలు సినిమాలు చేయడానికి కూడా మొగ్గు చూపుతుంటారు. ఒకవేళ డైరెక్టర్ అదృష్టం బాగోలేక అపజయం వచ్చిందంటే చాలు ఇక వారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. అలాంటి డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వీరు వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయం లో ఒక్క ఫ్లాప్ తో అడ్రస్ లేకుండా పోయిన వారు ఉన్నారు. వారెవరో చూద్దాం..?

# 1 క్రిష్ జాగర్లమూడి

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో మంచి పేరు సంపాదించిన డైరెక్టర్ క్రిష్. ఆయన గమ్యం, కృష్ణం వందే జగద్గురు, వేదం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రను చూపించిన డైరెక్టర్ ఈయన. వరుస విజయాలతో ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. ఇందులో ఆయనకు బాగా పేరు తెచ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ అని చెప్పవచ్చు. ఆయనకు బ్యాడ్ లక్ ఎన్టీఆర్ జీవిత కథ రూపంలో దూసుకొచ్చింది. కథానాయకుడు అలాగే మహా నాయకుడు అని రెండు పార్టులుగా వచ్చిన సినిమా ప్రేక్షకులు అంతగా ఆదరించక పోవడంతో ఫ్లాప్ అయింది. దీని తర్వాత వచ్చిన కొండపొలం మూవీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆ డైరెక్టర్ ఫ్లాప్ పేరు తెచ్చుకున్నాడు.#2 వివి వినాయక్

తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఈయన కూడా మంచి పేరు సంపాదించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఠాగూర్, దిల్, ఆది, చెన్న కేశవ రెడ్డి, అదుర్స్ వంటి చిత్రాలు రూపొందించి రికార్డు సృష్టించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రంగా ఖైదీ నెంబర్ 150 తీసి బొక్క బోర్లా పడ్డాడు. దీని తర్వాత సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటిలిజెంట్ సినిమా ఇంకా పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో స్టార్ డైరెక్టర్ ఫ్లాప్ డైరెక్టర్ గా మారిపోయాడు.#3 సురేందర్ రెడ్డి

తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న డైరెక్టర్లలో సురేందర్రెడ్డి ఒకరు. ఈయన సినిమాల్లో హీరోని చాలా ఎలివేట్ చేస్తాడు. హీరోలు చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తన స్క్రీన్ ప్లేతో సురేందర్ రెడ్డి మాయ చేస్తారు అనుకోండి. ఇతను రవితేజతో కిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ సంపాదించారు. అలాగే అల్లు అర్జున్ తో రేసుగుర్రం సినిమాతో మాస్ యాక్షన్ ను మరింత పెంచి చూపించారు. ఇలా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి తీశారు. ఈ సినిమా కాస్త బొక్క బోర్లా పడింది. దీంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో అనౌన్స్ చేసినటువంటి ఒక మూవీ కూడా క్యాన్సిల్ అయింది. ఈ విధంగా ఈ ముగ్గురు డైరెక్టర్లు ఒకే ఒక్క ఫ్లాప్ తర్వాత సినిమాలు తీయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు.

 

 


You may also like