తెలుగు “పోకిరి”… తమిళ్ “పోకిరి”..! వీళ్ళిద్దరిలో ఏ “హీరో” నటన బాగుందంటే..?

తెలుగు “పోకిరి”… తమిళ్ “పోకిరి”..! వీళ్ళిద్దరిలో ఏ “హీరో” నటన బాగుందంటే..?

by Mounika Singaluri

Ads

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా 2006లో వచ్చిన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. ఫ్లాపుల్లో ఉండి అప్పుల పాలు అయిపోయిన పూరి జగన్నాథ్ కసి మీద ఈ సినిమాని తీశారు. మహేష్ బాబు కేరిర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా పోకిరి సినిమా ఉంటుంది.

Video Advertisement

ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసిన సినిమా పోకిరి. ఈ సినిమా చాలా సెంటర్లలో సంవత్సరం కాలం పాటు ఆడింది. పోకిరి సినిమా తాజాగా రీ రిలీస్ చేస్తే మంచి కలెక్షన్స్ సాధించింది.అయితే మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని తమిళ్ లో పోకిరి పేరుతోనే విజయ్ రీమేక్ చేశారు. బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ పోకిరి సినిమాని వాంటెడ్ పేరుతో రీమేక్ చేశారు.

pokiri

అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక కంపారిజన్ నడుస్తుంది. తెలుగు పోకిరిలో మహేష్ బాబు బాగా నటించాడా లేక తమిళ్ పోకిరిలో విజయ్ బాగా నటించాడా అంటూ చర్చ పెడుతున్నారు. శృతి నాదే గన్ను నాదే అంటూ మహేష్ బాబు పోలీస్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ లో ఎవరు బాగా నటించారు అంటూ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నారు. అయితే చాలామంది తెలుగు వారు అయితే మహేష్ బాబు చాలా బాగా నటించాడు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. పలువురు తమిళ్ ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు కళ్ళల్లో ఇంటెన్సిటీ బాగా ఉంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

అయితే ఇక్కడ ఎవరు బాగా చేశారు అనేది మేటర్ కాదు. రెండు భాషల్లో కూడా ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరో చేశారు. ఎవరి క్రేజ్ కి తగ్గట్టు, ఎవరి ఇమేజ్ కి తగ్గట్టు అక్కడ సినిమా రూపొందించడం జరిగింది. ఏది ఏమైనా పోకిరి ఎన్ని భాషల్లో వచ్చిన హిట్ గా నిలవడం సంతోషించవలసిన విషయం. బాలీవుడ్ లో కూడా వాంటెడ్ సినిమా సూపర్ హిట్ అవడం శుభ పరిణామం. అక్కడ కూడా సల్మాన్ ఖాన్ హిందీ ఫ్యాన్స్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి సినిమాని రూపొందించారు.

watch video :

Also Read:రోజా గారి గొప్పతనం ఏంటి? రాకింగ్ రాకేష్ ఎం చెప్పారంటే…!!!!


End of Article

You may also like