ఇండియన్ సినిమా మొట్టమొదటి హీరోయిన్ ఎవరో తెలుసా..? ఏ సినిమాలో నటించారంటే?

ఇండియన్ సినిమా మొట్టమొదటి హీరోయిన్ ఎవరో తెలుసా..? ఏ సినిమాలో నటించారంటే?

by Anudeep

Ads

భారతీయ సినిమా తొలి హీరోయిన్ ఎవరు? స్త్రీ పాత్ర లేని సినిమాని మనం ఊహించగలమా? భారతీయ సినిమా ప్రారంభం నుండి భారతీయ చిత్రాలలో స్త్రీ పాత్రల ఉనికిని మనం చూడవచ్చు. కానీ నిజంగా స్త్రీలు నటించే వారు కాదు. స్త్రీ పాత్రలను పురుషులే పోషించేవారు.

Video Advertisement

భారతదేశంలో ఒకప్పుడు స్త్రీ విద్యను పాపంగా భావించేవారు. అటువంటి సమాజంలో స్త్రీలు సినిమాల్లో పాల్గొనడం అనేది అసాధ్యం. రోజులు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. స్త్రీలు సినిమాల్లో నటించడాన్ని మాత్రం గౌరవప్రదంగా భావించేవారు కాదు.

first heroin 2

అందుకే స్త్రీలు కూడా నటనకు దూరంగా ఉండేవారు. విద్యావంతులు, కులవృత్తుల కుటుంబాల్లో ఉండే స్త్రీలు కూడా నటనలోకి రావాలి అన్న ఆలోచనని కూడా చేయలేకపోయేవారు. అందుకే.. భారతీయ సినిమా మొదలైన తొలినాళ్లలో స్త్రీల ఉనికి ఉండేది కాదు. మరి భారత సినిమాల్లో తొలి హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. అయితే.. ఇందుకు సమాధానం ఏంటంటే.. భారత సినిమాలో కనిపించిన తొలి హీరోయిన్ మహిళ కాదు. ఒక పురుషుడే హీరోయిన్ లా నటించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ఆయన పేరు శ్రీ అన్నా సాలుంకే.

first heroin 3

భారత్ లో మొట్టమొదటి సినిమా 1896లో ప్రదర్శించబడింది. ఇది ఓ నిశ్శబ్ద చిత్రం. ఈ సినిమాను లూమియర్ సోదరులు రూపొందించారు. ముంబైలోని వాట్సన్ హోటల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. అలా సినిమాలు భారత్ లో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ పేరుతో ధుండిరాజ్ గోవింద ఫాల్కే అనే వ్యక్తి పూర్తి నిడివి సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో కథానాయిక తారామతి పాత్ర కోసం ఓ స్త్రీని పరిచయం చేయాలనీ అనుకున్నారు. అయితే అది చాలా కష్టమైంది. చివరకు ఆయన వ్యభిచార గృహాలలో స్త్రీలని కూడా అడిగి చూసారు. కానీ స్త్రీ మాత్రం దొరకలేదు. దీనితో పురుషుడైన అన్నా సాలుంకేను స్త్రీ పాత్రకు ఎంచుకున్నారు. అలా భారత సినిమాలో మొట్ట మొదటి హీరోయిన్ పాత్రని అన్నా సాలుంకే పోషించారు.


End of Article

You may also like