Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఇతర నటీనటులతో ఎంతో చనువుగా, స్నేహంగా ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో అగ్ర కుటుంబముగా కొనసాగుతున్నటువంటి దగ్గుబాటి కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంచి అనుబంధము ఉంది.
Video Advertisement
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. దాదాపు ఓకే జనరేషన్ కి చెందిన చిరంజీవి-వెంకటేష్ అగ్ర హీరోలుగా దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలారు. వారి స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వారిద్దరూ అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ను చరణ్ కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. చిరంజీవి, వెంకటేష్ మాట్లాడుకొని రామ్ చరణ్ అభిప్రాయం అడగ్గా.. అప్పుడు ఉపాసనను ప్రేమిస్తున్న విషయాన్ని బయట పెట్టాడట చరణ్. ఎవరితో ఎవరికి రాసుందో మనం చెప్పలేం. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. అలా రామ్ చరణ్-ఉపాసనలకు ఎప్పుడో రాసిపెట్టి ఉంది. వాళ్ళు భార్యాభర్తలు కావాలని భగవంతుడు నిర్ణయించాడు. పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్న ఈ జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.
మరోవైపు ఆశ్రిత హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారి మనవడిని ప్రేమించారు. కోరుకున్నవాడికి ఇచ్చి వెంకటేష్ ఆశ్రిత వివాహం చేశారు. భర్తతో పాటు విదేశాల్లో ఉంటున్న ఆశ్రిత హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ తో పాటు ఇన్ఫినిటీ ప్లేటెర్ అనే ఇంస్టాగ్రామ్ పేజీని నడిపిస్తున్నారు.
అలాగే ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఆ సంస్థ చారిటీ కార్యక్రమాలతో పాటు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ నడుపుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రామ్ చరణ్ వరల్డ్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు శంకర్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
End of Article