Ads
ప్రస్తుతం బేబీ మూవీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది.
Video Advertisement
ముక్కోణపు ప్రేమ కథగా తెరకెక్కిన బేబీ కల్ట్ బ్లాక్‌బస్టర్ వేడుకలను హైదరాబాద్‌లో సోమవారం నాడు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో డైరక్టర్ సాయి రాజేష్ ఒక షాకింగ్ విషయాన్ని తెలిపారు. బేబీ మూవీ స్టోరీని ఒక హీరోకు చెప్పాలని అనుకుంటే ఆ హీరో ఆ దర్శకుడు అయితే స్టోరీ వినను అన్నారని చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బేబీ కల్ట్ బ్లాక్‌బస్టర్ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, నాగబాబు, నిర్మాత రవి శంకర్ లు హాజరు అయ్యి, మూవీలో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ బేబీ మూవీ విషయంలో ఒక హీరో తనను అవమానించిన సంగతిని బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ, బేబీ మూవీ కథను ఒక హీరోకు చెప్పాలనుకుంటే ఆ దర్శకుడు అయితే స్టోరీ కూడా వినని ఆ హీరో అవమానించాడని, అలాంటి సమయంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తనను నమ్మి మంచి మూవీకి డైరెక్టర్ ను చేశారు. ఎస్.కె.ఎన్ తనను నమ్మి ఇంత ఖర్చు పెట్టాడు. దర్శకుడు మారుతిగారు మా కన్న ఎక్కువగా మూవీ పై నమ్మకం ఉంచారని చెప్పారు.
ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి మంచి చిత్రాలే తెరకెక్కిస్తానని మాటిస్తున్నానని వెల్లడించారు. అయితే కథ వినకుండానే బేబీ మూవీని మిస్ చేసుకున్నహీరో ఎవరని నెటిజెనలు సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ హీరో ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరనే విషయాన్ని సాయి రాజేష్ లేదా ఆ హీరో కానీ రివీల్ చేస్తారేమో చూడాలి.
Also Read: “పవన్ కళ్యాణ్- సుజిత్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో “బండ్ల గణేష్” స్పీచ్ ఇస్తే ఇలానే ఉంటుందేమో..!!
End of Article