“సర్కారు వారి పాట”లో హీరోయిన్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ కూతురా?

“సర్కారు వారి పాట”లో హీరోయిన్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ కూతురా?

by Megha Varna

Ads

“సరిలేరు నీకెవ్వరూ ” చిత్రంతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు.  .అయితే ఆ తర్వాత మహేష్ బాబు ఏ చిత్రంలో నటిస్తారు,ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయంపై అంతటా ఆసక్తి నెలకొంది.కాగా ఇప్పుడు ఈ మేటర్ లో పూర్తి క్లారిటీ వచ్చేసింది.పరుశురాం దర్శకత్వంలో “సర్కార్ వారి పాట” అనే చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.అయితే మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు అంతటా చర్చగా మారింది..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

sarkar vaari paata poster

sarkar vaari paata poster

సోలో చిత్రంతో దర్శుకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పరుశురాం విజయ్ దేవరకొండ తో తీసిన “గీత గోవిందం” చిత్రంతో కమర్షియల్ సెక్సస్ అందుకున్నారు.కాగా ఇప్పుడు మహేష్ బాబు తో ” సర్కారు వారి పాట” అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు దర్శకుడు పరుశురాం.అయితే  సర్కార్ వారి పాట చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ పోస్టర్ ను ఇటీవల విడుదల చేసారు.కాగా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.అయితే ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

 

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అని ఇప్పటికే పలు కధనాలు వినపడ్డాయి.అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు మరియు  దబాంగ్ 3 హీరోయిన్ అయిన సాయి మంజ్రేకర్ “సర్కార్ వారి పాట” చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతున్నారు అనే వార్త బలంగా వినపడుతుంది.ఈ నేపథ్యంలో అసలు సాయి మంజ్రేకర్ “సర్కార్ వారి పాట”  చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారా లేదా అనే విషయంపై ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే ఈ వార్త ఎంతవరుకు నిజమో వేచి చూడాలి.


End of Article

You may also like