సాయి పల్లవి న్యాచురల్​ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమెతో మొదలైన ఈ ట్రెండ్​ టాలీవుడ్ లో రోజురోజుకీ పెరుగుతోంది. కీర్తి సురేశ్​, రష్మిక మందన్న లాంటి స్టార్​ హీరోయిన్లు డీ గ్లామర్​ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. వీరి దారిలోనే మరో కన్నడ ​హీరోయిన్ తెలుగు ప్రేక్షకకుల ముందుకు రానుంది.

Video Advertisement

రీసెంట్ గా కన్నడలో విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ అనే చిత్రాన్ని తెలుగులో డబ్​ చేయనున్నారు. ఈ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ హీరోయిన్ ​గా నటించింది. న్యాచురల్​ లుక్స్​కి తో యూత్ ను ఆకట్టుకున్న ఆమె గురించి వెతుకుతున్నారు. మరి ఆమె ఎవరో? ఇప్పుడు చూద్దాం..
అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రేమకథతో తెరకెక్కింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించి, మెప్పించింది.
రుక్మిణీ న్యాచురల్​ లుక్స్​కి కన్నడ యువత ఫిదా అయ్యింది. ఈ మూవీ పోస్టర్స్​, పాటలు సోషల్​ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీతో రుక్మిణీకి కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలలో ​అవకాశాలు వచ్చాయి. రుక్మిణీ వసంత్ గురించి నెటిజెన్లు నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు. రుక్మిణి వసంత్ 1994లో కర్ణాటకలోని బెంగళూరులో డిసెంబరు 10న జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రను  కర్నాటకలో పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
ఆమె బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత లండన్‌ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో పట్టా పొందింది. ఆ తరువాత కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 2019లో బీర్బల్ ట్రైలాజీ కేసు 1′ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సప్త సాగర దాచే ఎల్లో ఆమె రెండవ సినిమా. ఇక త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆమె నటన, లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగులో కూడా పాపులారిటీ వస్తుంది. మరి సప్త సాగరాలు దాటి మూవీతో రుక్మిణీ వసంత్​ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: 50 ఏళ్ళు… ఎన్నో సినిమాలు… ఇంత గొప్ప థియేటర్ ని ఎందుకు మూసేశారు..? విషయం ఏంటంటే..?