సర్కారు వారి పాటలో హీరోయిన్ గా “కీర్తి సురేష్” ని ఎంపిక చేసింది ఎవరో తెలుసా..?

సర్కారు వారి పాటలో హీరోయిన్ గా “కీర్తి సురేష్” ని ఎంపిక చేసింది ఎవరో తెలుసా..?

by Sunku Sravan

Ads

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాలు థియేటర్లకు దూరమయ్యాయి. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టిన తరుణంలో వరుస సినిమాలతో మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్లు. ఇక ఏప్రిల్, మే నెలల్లో మాత్రం అనేక సినిమాలు మన ముందుకు వచ్చి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

Video Advertisement

అయితే మే నెలలో ఇంకా కొన్ని స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ఒక మూవీ సర్కారు వారి పాట. ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి కీర్తి సురేష్ ను ఎంపిక చేయడం వెనుక ప్రధాన హస్తం ఎవరిదో తెలుసుకుందాం..?సర్కార్ వారి పాట మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా బిజీగా ఉన్నారు.

ఈ సినిమా మే 12వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు పరశురామ్ అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మూవీ గురించి మూవీలోని హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గీత గోవిందం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా సర్కారు వారి పాట మూవీ కథను రాసుకున్నానని ఆయన అన్నారు. మహేష్ బాబుకు ఈ స్క్రిప్ట్ చెప్పగానే ఆయన ఓకే చెప్పారని, స్క్రిప్ట్ విన్నాక మహేష్ బాబు కథ బాగుంది అని సెకండ్ కూడా ఇచ్చారట. దీని తర్వాత హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే పరశురాం కీర్తి సురేష్ పేరు చెప్పారట.

దీంతో వెంటనే మహేష్ బాబు కూడా ఓకే అనేశారు అని తెలుస్తోంది. కీర్తి సురేష్ నటన చూసినప్పటినుంచి ఆమెతో సినిమా చేయాలని అనుకుంటున్నాం అని ఇది సర్కార్ వారి పాటతో కుదిరిందని చెప్పాడు దర్శకుడు. కీర్తి సురేష్ ను తీసుకోవడం వెనుక పాత్ర పరమైన కారణం ఉండి ఉండవచ్చని అందుకే మహేష్ బాబు అభ్యంతరం కూడా చెప్పలేదని అన్నారు. అయితే ఈ అమ్మడు పేరు నేనే సిఫార్సు చేశానని డైరెక్టర్ పరశురామ్ తెలియజేశారు.


End of Article

You may also like