“టైగర్ నాగేశ్వర్రావు” ఎవరు..? రవి తేజ, బెల్లం కొండ శ్రీనివాస్ లు అతని బయో పిక్ నే ఎందుకు తీస్తున్నారు..?

“టైగర్ నాగేశ్వర్రావు” ఎవరు..? రవి తేజ, బెల్లం కొండ శ్రీనివాస్ లు అతని బయో పిక్ నే ఎందుకు తీస్తున్నారు..?

by Anudeep

Ads

దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ తన 71వ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ సినిమా పేరు ” టైగర్ నాగేశ్వర్రావు”. టైగర్ నాగేశ్వర్రావు బయో పిక్ నే సినిమాగా మలుస్తున్నారు. మాస్ సినిమాల్లో నటనను ఇరగదీసే రవితేజ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఖిలాడీ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ నడుస్తోంది.

Video Advertisement

Raviteja

ఇది ఇలా ఉండగా, త్రినాథ రావు దర్శకత్వంలో “ధమాకా” అనే సినిమాను కూడా చేయనున్నాడు. ఇవి సెట్స్ దశల్లో ఉండగానే.. “టైగర్ నాగేశ్వర్రావు” సినిమాను అనౌన్స్ చేసాడు. వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా పోస్టర్ కు బాగానే రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ లో కేవలం రవితేజ కాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి.

stuvertpuram 2

ఇదే బయోపిక్ కాన్సెప్ట్ తో బెల్లం కొండ శ్రీనివాస్ కూడా “స్టూవర్టుపురం దొంగ” అనే టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేసాడు. ఒకే వ్యక్తి బయోపిక్ తో ఇద్దరు హీరోలు సినిమా చేస్తుండడంతో సోషల్ మీడియా లో దీని గురించిన చర్చ మొదలైంది. “టైగర్ నాగేశ్వర్రావు” ఎవరు? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

stuvertpuram 1

టైగర్ నాగేశ్వర్రావు స్టూవర్టుపురం లో పేరు మోసిన దొంగ. అతను ప్లాన్ చేసి దొంగతనం చేస్తే ఎవ్వరికి దొరికేవాడు కాదు. లెక్కలేనన్ని దొంగతనాలు చేసి ప్రజలను భయపెట్టడమే కాదు పోలీసులను కూడా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అతని లైఫ్ స్టోరీ లో లెక్కలేనన్ని కీలక మలుపులు ఉన్నాయి. వాటి ఆధారంగానే ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలపై తెలుగు ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.

 


End of Article

You may also like