Ads
వడ్డే నవీన్.. నిన్నటి తరంలో ఓ వెలుగు వెలిగిన నటుడు. రెండు దశాబ్దాల క్రితం హీరోగా వడ్డే నవీన్ పలు హిట్లు కొట్టారు. వరుస విజయాలతో టాప్ హీరోగా నిలిచారు. ఆయన చేసిన సినిమాలు తక్కువే. కానీ, ఆయనకు ఉన్న స్టార్ డమ్ తక్కువేమి కాదు. వరుసగా విజయాలు అందుకుంటున్నాడు అని అందరు అనుకునేలోపు ఆయనకు ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి.
Video Advertisement
పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆ అవకాశాలు రావడం కూడా తగ్గిపోయాయి. దీనితో.. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడే నవీన్. “కోరుకున్న ప్రియుడు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. ఆయన నటించిన “పెళ్లి” సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు వంటి సినిమాలు కూడా వడ్డే నవీన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వడ్డే నవీన్ వివాహం కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితోనే వివాహం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణకు కూతురు అయిన చాముండేశ్వరిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. అంటే.. చాముండేశ్వరి గారు ఎన్టీఆర్ కు మనవరాలు అవుతారు.
అయితే.. వ్యక్తిగత కారణాల వలన వీరిద్దరి వివాహ బంధం నిలవలేదు. వ్యక్తిగతంగా వడ్డే నవీన్ ఇబ్బందులు ఎదుర్కొంటు ఉండడం వలనే సినిమాలకు కూడా దూరం అయ్యారని టాలీవుడ్ లో అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే.. ప్రస్తుతం వడ్డే నవీన్ మరొక అమ్మాయిని వివాహం చేసుకుని.. హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
End of Article