“విక్రమ్” సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ముందుగా అనుకున్న నటులు ఎవరో తెలుసా?

“విక్రమ్” సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ముందుగా అనుకున్న నటులు ఎవరో తెలుసా?

by Anudeep

Ads

ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారు అనగానే ఆసక్తి మొదలైంది. సాధారణంగా కమల్ హాసన్ సినిమా అంటే తెలుగులో కూడా విడుదల అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది.

Video Advertisement

అయితే.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. ఫహాద్ ఫాజిల్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కనిపిస్తారు. చివరలో సూర్య అప్పీయరెన్సు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇది ఇలా ఉంటె.. సినిమాలలో సహజంగా ఓ పాత్ర కోసం ఓ వ్యక్తిని అనుకుని.. చివరకు అతనికి కుదరకపోవడంతో ఆ ప్లేస్ లో మరో స్టార్ ను తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. అలానే విక్రమ్ సినిమాలో కూడా చోటు చేసుకుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం తొలుత మరో హీరోని సంప్రదించారు. అయితే అనుకోని కారణాల వలన ఆ పాత్ర విజయ్ సేతుపతికి దక్కింది. ఆ పాత్రతో విజయ్ సేతుపతికి ఎంత మంచి నేమ్ వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం.

vijay sethupathi

తొలుత విజయ్ సేతుపతి పాత్ర కోసం యాక్టర్, డాన్స్ డైరెక్టర్ అయిన ప్రభుదేవాను సంప్రదించారట. ప్రతినాయకుడి పాత్రకు నటించాల్సిందిగా ప్రభుదేవాను కోరారట. తరువాత రాఘవ లారెన్స్ ను కూడా సంప్రదించారట. అయితే.. ఏమి జరిగిందో తెలియదు కానీ.. వారికి బదులుగా ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించి ఆయననే ఫిక్స్ చేశారట.


End of Article

You may also like