“సలార్” లో ఈ 2 సీన్స్ లేవు ఏంటి..? ఎందుకు డిలీట్ చేశారు..?

“సలార్” లో ఈ 2 సీన్స్ లేవు ఏంటి..? ఎందుకు డిలీట్ చేశారు..?

by kavitha

Ads

నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ ‘సలార్’ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ కి ఒక్కసారిగా ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని చెప్పవచ్చు. భగవంత్ కేసరి తర్వాత బ్లాక్ బస్టర్ లేక అల్లాడిపోతున్న థియేటర్లు సలార్ తో హౌస్ ఫుల్ బోర్డులతో, కళకళలాడుతున్నాయి.

Video Advertisement

బాక్సాఫీస్ దగ్గర సలార్ సంచలనం సృష్టిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. థియేటర్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. ‘సలార్’ టాక్ గురించి, కలెక్షన్స్ గురించి పక్కనబెడితే, సినిమాలో సీన్స్  మిస్ అయినట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించిందని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా సలార్ మూవీలో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని టాక్. కథపరంగా ఎలా ఉన్నా సినిమాలో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉండడంతో ఫ్యాన్స్,  మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తోంది.అయితే ‘సలార్’ టీజర్ లో ఓ తాత, హీరో ప్రభాస్‌ని ‘డైనోసర్’తో పోల్చడం తెలిసిందే. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి కూడా ‘డైనోసర్ ఎపిసోడ్’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పడం తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన తరువాత జక్కన్నతో పాటు , ఫ్యాన్స్, ఆడియెన్స్ నిరాశ పడినట్టున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘సలార్ పార్ట్-1’ లో ఆ ఎపిసోడ్ మిస్ అయ్యింది. బహుశా పార్ట్-1 లో ఉండొచ్చేమో.
ఈ సన్నివేశం మాత్రమే కాకుండా మరో రెండు సన్నివేశాలు కూడా సలార్ పార్ట్-1 మిస్ అయినట్టు తెలుస్తోంది. సూరిడీ పాటలో భయపడి లేచిన పృధ్వీ రాజ్ తో ‘ఒరే నేనున్నా కదా పడుకో’ అంటూ ప్రభాస్, కి చెప్పే సీన్ కాగా, మూడవది కార్ సీన్, దాంతో ఈ సీన్స్ ఎందుకు పెట్టలేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సీక్వెల్ లో ఈ సీన్స్ ఉంటాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/C1LqOFlJanf/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: “ఈ సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… ప్రభాస్ “సలార్” మూవీపై కామెంట్స్..!


End of Article

You may also like