Ads
బ్రహ్మానందం కమెడియన్ మాత్రమే కాదు. మంచి ఆర్టిస్ట్ కూడా. ఆయన గతంలో గీసిన చిత్రాలే ఆ విషయాన్నీ చెబుతాయి. ఆయన వేసిన చిత్రాలు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని సినిమాలు చూస్తే.. ప్రతి సినిమాలోనూ బ్రహ్మి కచ్చితంగా ఉంటారు.
Video Advertisement
అసలు బ్రహ్మానందం లేని సినిమానే లేని రోజులు చాలానే ఉన్నాయి. ఆయన నటించిన సినిమాలు అన్ని ఉన్నాయ్ మరి. ఓ సెలబ్రిటీ కంటే కూడా బ్రహ్మి కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటే.. ఆయన రేంజ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు వారు ఎప్పటికి మర్చిపోలేని కమెడియన్ బ్రహ్మానందం గారు. దాదాపు మూడు జెనరేషన్ల కిడ్స్ ని తన కామెడీ తో ఎంటర్టైన్ చేసిన కామెడీ బ్రహ్మ ఆయన. ఒకప్పుడు ఆయనకు ఉన్న డిమాండ్ చూస్తే మైండ్ పోతుంది. రోజుకు ఐదు లక్షల రూపాయల పారితోషికం తీసుకుని ఆయన సినిమాల్లో నటించే వారు. అయినా ఆయన షెడ్యూల్ ఎంత బిజీ గా ఉండేదో చెప్పనలవి కాదు.
అయితే.. ఇప్పటికి కూడా ఆయన డిమాండ్ ఏమీ తగ్గలేదు. కానీ, కామెడీ బ్రహ్మ అయిన బ్రహ్మానందం సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నారు. ఆయన ఏమైపోయారు అన్న అనుమానం అందరికి కలుగుతోంది. కొంతమంది ఆయనకు హార్ట్ సర్జరీ అవడంతో ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఆయన దూరం అయ్యారని భావిస్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగానే కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆయనలా హాస్యాన్ని పండించే కమెడియన్ల కొరత ఇప్పటికీ ఉంది.
End of Article