“కొండవీటి సింహం” సినిమా మధ్యలోనే చిరంజీవిని ఎందుకు తప్పించారు..? అసలు కారణం ఇదేనా..?

“కొండవీటి సింహం” సినిమా మధ్యలోనే చిరంజీవిని ఎందుకు తప్పించారు..? అసలు కారణం ఇదేనా..?

by Anudeep

Ads

కళామ్మతల్లి ఒడిలో నిలదొక్కుకోవాలంటే ముందుగా ఉండాల్సింది ఓపిక, కష్టం. ఈ రెండు అలవాట్లు ఉంటే సినీ ఇండస్ట్రీలో ఏ విధంగానైనా నెట్టుకు రావచ్చు. దీంతో పాటుగా గుమ్మడికాయఅంత కష్టం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. కానీ చిరంజీవి తన అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకున్నాడు. 1978లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతూ చరిత్ర సృష్టించారు.

Video Advertisement

పునాదిరాళ్లు సినిమాతో తన జీవిత గమనానికి పునాది వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా హిట్లు, ఫ్లాపులతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు.1978 ఫిబ్రవరి 11వ తేదీన పునాదిరాళ్లు సినిమాతో మొట్టమొదటిసారిగా అలనాటి మేటి నటి సావిత్రితో నటించే అవకాశాన్ని పొందాడు.

chiru 1

ప్రతి సినిమాలో తన స్టైల్ లో డైలాగ్ డెలివరీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. తనకంటూ ప్రత్యేక శైలితో తక్కువ కాలం లోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకుని మెగాస్టార్ అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న రోజుల్లోనే చిరంజీవి కూడా హీరోగా పరిచయం అయ్యారు. ఆ టైం లో “కొండవీటి సింహం” అనే సినిమా కోసం ఎన్టీఆర్ కొడుకు పాత్రలో చిరంజీవిని ఎంచుకున్నారు.

chiru 2

అప్పట్లోనే లైమ్ లైట్ లోకి వస్తున్న చిరంజీవి ఎన్టీఆర్ కొడుకుగా, అదే సినిమాలో విలన్ గా నటించాల్సి ఉంది. అయితే అందుకు చిరంజీవి సిద్ధంగా లేరు. కానీ, ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలకూ చెప్పలేరు. ఎన్టీఆర్ పై గౌరవంతో చిరంజీవి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. అయితే ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు కనిపెట్టేసారు. చిరంజీవి షూటింగ్ చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ ను చూసి డైలాగ్స్ చెప్పలేక భయపడ్డారు. దీనితో అర్ధం చేసుకున్న దర్శక నిర్మాతలు ఆ సినిమా నుంచి చిరుని తప్పించి ఆల్రెడీ సింహబలుడు సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా చేసి సక్సెస్ అయిన మోహన్ బాబుని పెట్టి సినిమా కంప్లీట్ చేసారు.


End of Article

You may also like