Ads
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. సినీ నేపథ్యంతో వచ్చిన హీరోలు ఉంటే, సినీ నేపథ్యం లేకుండా వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఇప్పుడు జనరేషన్ లో అలా సినీ నేపథ్యం లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. ముందు సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోగా ఎదిగారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ దేవరకొండ తెలిశారు.
Video Advertisement
పెళ్లి చూపులు సినిమా విజయ్ దేవరకొండకి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ మార్చేసింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం అర్జున్ రెడ్డి సినిమా వైపు చూసింది. అలాంటి ఒక ప్రయత్నంలో భాగమైన విజయ్ దేవరకొండ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయ్యారు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు విజయ్ దేవరకొండ నటన వారికి నచ్చింది అని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరొక హిట్ కొట్టారు. మహానటి సినిమాలో కూడా ఒక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ నటించిన గత కొన్ని సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు.
సాధారణంగా ఎవరైనా ఒక యాక్టర్ జీవితంలో హిట్, ఫ్లాప్ సినిమాలు సహజం. విజయ్ దేవరకొండ కెరీర్ లో కూడా ఇలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే, విజయ్ దేవరకొండ మీద భారీగా కామెంట్స్ వస్తాయి. తన యాటిట్యూడ్ బాలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కొంత మంది అయితే సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఈ మాటలు కారణం అని అనే వారు కూడా ఉన్నారు. అసలు విజయ్ దేవరకొండ మీద ఎందుకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది హీరోల కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కదా. విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ప్రేక్షకులని ఉత్సాహపరిచేలాగా మాట్లాడుతారు.
ఆ మాటల్లో తనకి సినిమా మీద ఉన్న నమ్మకం కనిపిస్తుంది. తన సినిమా గురించి అందరికీ ఒక హామీ ఇస్తున్నట్టు ఆ మాటలు ఉంటాయి. ఒక్కొక్కసారి సినిమాలో పనిచేసిన వారు ఆ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. విజయ్ దేవరకొండ అదే కాన్ఫిడెన్స్ ని అందరికీ చెప్తారు. కానీ అది చాలా మందికి తప్పుగా అర్థం అవుతుంది. ఈ కారణంగానే విజయ్ దేవరకొండ మీద విమర్శలు వస్తాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ కూడా ఇటీవల స్టార్ట్ అయిన షెడ్యూల్ లో పాల్గొన్నారు.
ALSO READ : కార్తీకదీపం-2 చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ జర్నీ..! తల్లి, తండ్రి చెవిటి, మూగ అవ్వడంతో..?
End of Article