Ads
పాలు, పెరుగు, నెయ్యి, వెన్న.. ఇలా పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఏదో ఒక విధంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలామంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ వేసవి కాలంలో చల్లటి నీరు లేదా చల్లటి మజ్జిగ తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. శరీరంలోని వేడిని కంట్రోల్ చేయడానికి మజ్జిగ తాగుతారు.
Video Advertisement
పెరుగు నుంచే మజ్జిగను తయారు చేస్తారు. కానీ, పెరుగు, మజ్జిగ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల శరీరం లో వేడి పెరిగిపోతుంది. అలాగే ఇది బరువును పెంచుతుంది. కానీ మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరం లోని వేడి తగ్గటమే కాకుండా.. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. అయితే ఈ రెండు పాల నుంచే వచ్చినా.. ఎందుకు ఇలా భిన్న ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు పాలతోనే తయారవుతుంది కానీ.. గట్టిగా తోడుకున్న పెరుగు లో యాక్టీవ్ బాక్టీరియా ఉంటుంది. అది శరీరం లోని వేడికి జత చేరి ఇంకా వేడిని పెంచేస్తుంది. అలాగే పెరుగు పేగుల్లోకి వెళ్లి అక్కడ ఆమ్లాలతో కలిసి అరిగేందుకు సమయం తీసుకుంటుంది. ఈ నేపథ్యం లో అది పులిసిపోతుంది. దీంతో ఒంట్లో వేడి పెరిగిపోతుంది.
అదే పెరుగుని చిలికి మజ్జిగగా చేసినపుడు దానిలోని బాక్టీరియా విచ్చిన్నం అవుతుంది. మజ్జిగ పులిసే సమయానికే అరిగిపోతుంది. దీంతో వేడి చెయ్యదు. సులభంగా జీర్ణం అవుతుంది. అందుకే మజ్జిగ వినియోగం జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఆ మజ్జిగ ఒంటికి చలువ చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తుంది.
పెరుగులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ తక్కువగా ఉన్న వారికి పెరుగు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు మరియు మజ్జిగ రెండూ విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఈ రెండింటి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. వేర్వేరు పరిస్థితులలో తీసుకున్నప్పుడు వారికి వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. వైద్యులు కూడా అనేక వ్యాధులలో బాధపడుతున్న వారు పెరుగు తినాలని సిఫార్సు చేస్తారు.
End of Article