దర్శక ధీరుడు రాజమౌళి తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా ఓ పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ సినిమా కి మంచి గుర్తింపు వచ్చింది. అలానే అవార్డులు కూడా వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా మూలంగా రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవానికి వెళ్లారు. అక్కడ ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించారు. అలానే ఈ సినిమా ఎన్నో విజయాల్ని అందుకుంది.

Video Advertisement

ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఈ సినిమా దక్కించుకుంది. గత ఏడాది మార్చి 23వ తేదీన ఈ సినిమా విడుదలైంది.

the story behind RRR 'natu natu' song..!!

పాన్ ఇండియా స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంది ఆర్ఆర్ఆర్ సినిమా. అయితే అవార్డు వేడుకలలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటోంది. కానీ నిర్మాతగా వ్యవహరించిన దానయ్య మాత్రం ఎక్కడా కనపడటం లేదు. ఏ అవార్డు వేడుకల్లో కూడా ఆయన కనపడలేదు. ఆయన అక్కడికి రాలేదు. సినిమా అవార్డులకి దానయ్య దూరంగా ఉంటున్నారు.

why RRR is the best film..

చాలా మంది చిత్ర బృందం కావాలనే దానయ్యని పక్కన పెట్టేసారని అంటున్నారు. అయితే సినిమా అవార్డు వేడుకలకు ఎందుకు దానయ్య దూరంగా ఉంటున్నారు..? అసలు ఏమిటి విషయం అనేది చూస్తే… దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమా వేడుకలలో ఇండియాలో మాట్లాడడానికి కొంచెం తడబడ్డారు అటువంటిది విదేశాలకు తీసుకువెళ్లి అక్కడ వేదిక మీద ఇబ్బంది పెట్టడం సరైనదే కాదు.

ఈ సినిమా యూనిట్ బరువు బాధ్యతలని వారి భుజాల మీద వేసుకున్నారు. ఆయనకు వచ్చిన అవార్డులను రాజమౌళి అందుకుంటున్నారని క్లియర్ గా తెలుస్తోంది. ఈ కారణంగానే దానయ్య అవార్డుల వేడుకలకు దూరంగా ఉంటున్నారు అంతేకానీ ఇతర కారణం ఏమి లేదు. ఆస్కార్ వేడుకలలో అయినా దానయ్య కనపడతారా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.