Ads
దాసరి గురించి ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి ఎంతో మందిని స్టార్ హీరోలుగా ఎదిగేందుకు ప్రోత్సహించారు. ఆయన కాలం చేసాక.. ఇప్పటివరకు ఆయన లేని లోటుని ఎవరు పూడ్చలేకపోయారు. అయితే.. దాసరి కొడుకు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
Video Advertisement
దాసరి తన చిన్న కుమారుడు అరుణ్ ని స్టార్ హీరో చేయాలని కలలు కన్నారు. స్టార్ హీరో అవ్వడానికి అన్ని లక్షణాలు అరుణ్ లో ఉన్నా.. అరుణ్ మాత్రం హీరో అవ్వలేకపోయాడు.
టీవీ 5 కధనం ప్రకారం.. దాసరి తన దర్శకత్వంలో అరుణ్ ని హీరో గా పరిచయం చేసారు. అయితే.. కథల ఎంపికలో తప్పిదాల వలన అరుణ్ స్టార్ హీరోగా ఎదగలేకపోయారు. చిన్న, సామాన్యుడు, ఆదివిష్ణు వంటి సినిమాల్లో అరుణ్ హీరోగా నటించారు. కానీ, ఈ సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తీసుకురాలేదు.
దాసరి మరణించాక.. అరుణ్ సినిమాలపై ఫోకస్ ని తగ్గించారు. అయితే.. ఆయన ఇరుక్కున్న వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు. అన్న ప్రభుతో ఆస్తి వివాదం వల్ల ఆయన వార్తల్లోకెక్కారు. గోడ దూకి అక్రమంగా ఇంట్లోకి వచ్చాడు అంటూ.. ఆయన అన్న ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయ్యింది. ఇప్పటికి వారి మధ్య ఇంటి తగాదా నడుస్తోంది.
తాజాగా.. అరుణ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మద్యం మత్తులో కార్ ని వేగంగా నడిపారు. దీనితో ఆయనపై బంజారాహిల్స్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దీనితో అరుణ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన దాసరి తనయుడి పరిస్థితి ఇలా ఉండడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆవేదన చెందుతున్నారు.
End of Article