Ads
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ వచ్చినవారు ఉన్నారు. అలాగే స్టార్ డమ్ అనుభవించి, ఆ తరువాతి కాలంలో అన్నిటిని పొగొట్టుకుని, సాధారణ జీవితం గడుపుతున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ దేవయాని ఒకరు.
Video Advertisement
ప్రేమలేఖ మూవీని చూసినవారెవ్వరూ హీరోయిన్ దేవయానిని అంత ఈజీగా మరిచిపోలేరు. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించింది. అయితే ప్రస్తుతం ఆమె ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఆ పరిస్థితి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం.. దేవయాని ముంబయిలో 1974లో జూన్ 22న జన్మించింది. ఆమె తండ్రి కర్నాటకలోని మంగళూరుకు చెందిన కొంకణికి చెందినవారు. తల్లి మలయాళీ. ఆమె 1995 లో ‘దిల్ కా డాక్టర్’ అనే మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత బెంగాలీ మూవీ ‘షాత్ పొంచోమి’ లో నటించింది. ఆమెకు గురింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆమె తమిళం, తెలుగు, కన్నడ , మలయాళం , హిందీ, బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో నటించింది. దేవయాని కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.
సౌత్ ఇండియాలో ఒక ఎపిసోడ్ లో నటించడానికి గాను లక్షరూపాయల అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన తొలి సీరియల్ నటి దేవయాని. 30 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగిన దేవయాని ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. దానికి కారణం కోలీవుడ్ ఇండస్ట్రీలో శరత్‌కుమార్, అజిత్ వంటి హీరోలతో ఎఫైర్ సాగించినట్లు పలు వార్తలు రావడంతో అక్కడ అవకాశాలు రాలేదని టాక్. 2001లో దేవయాని కోలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ను ప్రేమించారు. కానీవారి ప్రేమ దేవయాని తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గుడిలో వివాహం చేసుకుందని తెలుస్తోంది.
దీంతో దేవయాని తల్లిదండ్రులు ఆమె అప్పటి దాకా సంపాదించిన మొత్తం నుండి ఏమి ఇవ్వలేదట. ఆమె చేతిలో డబ్బు లేకపోవడం, వివాహం తరువాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. రోజుకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా నిలిచిన దేవయాని జీవితం మళ్లీ దారిలోకి వచ్చింది. ఈ జంటకి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అలా సంపాదించిన డబ్బుతో సినిమా నిర్మాణం మొదలుపెట్టింది.
ఆమె భర్త డైరెక్షన్ లో కొన్ని సినిమాలు తీయగా, అవి ప్లాప్ అయ్యి, డబ్బు అంతా పోయి, అప్పుల పాలయ్యారట. వాటిలో కొంత చెల్లించి రుణాల బాధ నుండి నుండి బయటపడ్డారట. ఆ తరువాత దేవయాని యాక్టింగ్ మానేసి, తమిళనాడులోని అన్నాసాలైలో చర్చ్‌పార్కు కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు చిన్నప్పటి నుండి టీచర్ కావాలనే కోరిక ఉండేదని, అందుకే తన పిల్లల స్కూల్ లోనే టీచర్ గా చేస్తున్నానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది.
Also Read: స్కంద… SVSC..! ఈ 2 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ గమనించారా..?
End of Article