కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా సంచలనమే. 1995 నుండి ఇప్పటివరకు ఎన్నో సంచలనాలు సృష్టించాడు. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఒక సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం చేస్తూ, నటిస్తున్నారు.

Video Advertisement

ఆ మూవీకి యూఐ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఉపేంద్ర పుట్టిన రోజు సెప్టెంబర్ 18న సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ టీజర్‌తో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్ళాడు. ఉపేంద్ర పై పదేళ్ల పాటు కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఉపేంద్ర 90లలో  ఓం,  ఎ, ఉపేంద్ర, రా లాంటి సినిమాలతో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగానూ ఉపేంద్ర వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర డైరెక్షన్ లో మూవీ అంటే టేకింగ్,  కథాకథనాలు ఆడియెన్స్ అంచనాలకు అందని రేంజ్ లో ఉంటుంది. ‘ఉపేంద్ర’ మూవీతో తెలుగులో హిట్ అందుకుని భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉపేంద్ర, గత 20 ఏళ్ళలో  పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అయితే చాలా విరామం తర్వాత ‘యుఐ’ అనే సినికు దర్శకత్వం చేస్తూ, నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను సెప్టెంబర్ 18న థియేటర్లో రిలీజ్ చేశారు. టీజర్ చూడడానికి వెళ్ళిన ఫ్యాన్స్ ఉపేంద్ర  ఇచ్చిన షాక్‌ కి కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయారు. టీజర్ ప్లే చేయగానే ఒక్కసారిగా చీకటిగా మారింది. విజువల్ ఏం లేకుండా ఆడియో మాత్రమే వినిపించడంతో ముందుగా ఏదో టెక్నికల్ ఎర్రర్ అని భావించారు. కానీ టీజర్ అది అని గ్రహించడానికి టైమ్ పట్టింది.
అయితే గత కొద్దిరోజులుగా ఉపేంద్రపై కన్నడ ఇండస్ట్రీలో పదేళ్ల పాటు సినిమాలు చేయకుండా నిషేధం విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఉపేంద్ర సినిమా తరువాత ఆయన డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. దాంతో ఉపేంద్రను బ్యాన్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ఉపేంద్ర, నటన వైపు వెళ్లాలనే ఉద్దేశ్యంతో డైరెక్షన్ కు దూరంగా ఉన్నట్టు తెలిపారు.

Also Read: థియేటర్ల‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జవాన్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?