ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫేస్ ని చూపించకపోవడానికి కారణం ఇదేనా..?

ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫేస్ ని చూపించకపోవడానికి కారణం ఇదేనా..?

by Harika

సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా హనుమాన్. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. భక్తి సినిమాలు అంటే మన దేశంలో మామూలుగానే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మంచి కాన్సెప్ట్ తో ఉన్న భక్తి సినిమా వస్తే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి ఈ సినిమా మరొక నిదర్శనంగా నిలిచింది.

Video Advertisement

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూపొందించారు. తర్వాత ఈ సినిమా కథతో సంబంధం ఉన్న సినిమాలు సినిమాలు చాలానే వస్తాయి అని చెప్పారు. దీని నెక్స్ట్ పార్ట్ అయిన జై హనుమాన్ సినిమాని కూడా ఈ సినిమా చివరిలో ప్రకటించారు.

ఆ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే, మొదటి భాగంలో హనుమంతుడి పాత్ర పోషించిన వ్యక్తిని మనకు చూపించలేదు. ఆ పాత్ర పోషించిన హీరో ఎవరు అయ్యి ఉంటారు అనే సస్పెన్స్ తోనే సినిమాని ముగించారు. ఆ పాత్ర పోషించిన హీరో వీళ్లే అంటూ కొన్ని హీరోల పేర్లు కూడా వచ్చాయి.

why did prashant varma did not reveal hanuman face in hanuman

అయితే ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం, ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్ర పోషించే హీరోగా ఎవరిని అనుకోలేదు. జై హనుమాన్ సినిమా మొత్తం హనుమంతుడి పాత్ర మీదే నడుస్తుంది. కాబట్టి హనుమంతుడి పాత్ర పోషించే వ్యక్తిని అదే సినిమాలో చూపించాలి అని అనుకున్నట్టు సమాచారం. కాబట్టి ఇప్పుడు కేవలం కళ్ళ వరకు మాత్రమే చూపించారు. మరి హనుమంతుడి పాత్రలో నటించే హీరో ఎవరో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా సరే, ప్రశాంత్ వర్మ తీసుకున్న నిర్ణయం చాలా సరైనది అని అంటున్నారు.

ఒకవేళ హనుమంతుడు పాత్ర పోషించిన వ్యక్తిని ఇప్పుడే చూపించేస్తే నెక్స్ట్ పార్ట్ కి అంత సస్పెన్స్ ఉండదు కాబట్టి హనుమంతుడిగా ఎవరు నటిస్తారు అనే విషయం మీద కూడా ఇంకా ఆసక్తి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ లో చూపించడం అనేది సరైన నిర్ణయం అని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. దాంతో నెక్స్ట్ రాబోతున్న జై హనుమాన్ సినిమా ఇంకా భారీగా ఉండబోతోంది అని తెలుస్తోంది.

ALSO READ : హనుమాన్ సినిమాకి ఇన్ని కోట్లు వచ్చినా కూడా నిర్మాతకు లాభాలు దక్కలేదా..? అలా చేసి ఉంటే..?


You may also like

Leave a Comment