భర్తలు పరాయి స్త్రీలపై ఎందుకు మోజు పడతారు..? అందుకు 3 ప్రధాన కారణాలు ఇవే..!

భర్తలు పరాయి స్త్రీలపై ఎందుకు మోజు పడతారు..? అందుకు 3 ప్రధాన కారణాలు ఇవే..!

by Anudeep

Ads

జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లితో రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. ఇద్దరు వ్యక్తులు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అయితే చాలా మందికి ఇది తీపి అనుభవాన్ని ఇస్తే కొందరి జీవితంలో మాత్రం ఇది చేదుగా మిగిలిపోతుంది. ఇద్దరి మధ్య బంధం తెగిపోవడానికి వివాహేతర సంబంధాలు కూడా కారణాలవుతాయి.

Video Advertisement

అయితే.. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉన్నా కూడా కొందరు పరాయి స్త్రీల వైపు ఎందుకు కన్నెత్తి చూస్తారు..? భార్యని పట్టించుకోకుండా మరో అమ్మాయి వైపు ఎందుకు మోజు పడతారు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య అయినా భర్త అయినా తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమని, సంతోషాన్ని ఆశిస్తారు. తమ జీవిత భాగస్వామి తమనే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటారు. ఆ ప్రేమ దొరికిన వారు సంతోషంగా ఉంటారు. తమ జీవిత భాగస్వామిని మరింతగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ.. ఆ ప్రేమ దొరక్క.. ఇంట్లో మనశ్శాంతి కరువైనప్పుడే ఎవరైనా పక్క చూపులు చూడాలనుకుంటారు.

illegal affair 3

భార్య విషయంలో భర్తకి అయినా, భర్త విషయంలో భార్యకి అయినా కొన్ని నచ్చని గుణాలు ఉంటాయి. ఈ నచ్చని వాటినే మనసులో పెట్టుకుని వారికి దూరంగా ఉంటూ ఉంటారు. దీనివల్ల వచ్చే ఇబ్బందిని ఇద్దరూ అనుభవిస్తుంటారు. అయితే.. వీరు నచ్చని గుణాలను అంగీకరించి ప్రేమించుకోగలిగినప్పుడు అంత దూరం అనేది ఏర్పడదు. ఎప్పుడైతే అంగీకరించుకోలేకపోతారో అప్పుడే వారి మధ్య దూరం పెరుగుతుంది.

illegal affair 4

#1 స్వేచ్ఛ:
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలా గొడవ మొదలవడానికి మొదటి కారణం.. పార్ట్ నర్ నుంచి స్వేచ్ఛ కావాలని అనుకోవడం. దీనివల్ల ప్రతిదీ సమస్యగా కనిపించడం మొదలవుతుంది.
#2 అర్ధం చేసుకోకపోవడం:
రెండవ కారణం ఏంటంటే ఆఫీసులో భర్తకి ఉండే పని ఒత్తిడిని భార్య అర్ధం చేసుకోకపోవడం, ఇంటి తాలూకు బాధ్యతలు, వర్కింగ్ విమెన్ అయితే ఆమెకు ఉండే ఇబ్బందుల గురించి భర్త ఆలోచించకపోవడం వలన కూడా దూరం పెరుగుతుంటుంది.

illegal affair
# ఎక్కడో ఫ్రస్టేషన్ ను పార్ట్ నర్ పై చూపడం:
ఇంట్లో ఇబ్బందుల వలనో, లేక ఆఫీస్ లో గొడవల వల్లనో వచ్చిన ఫ్రస్టేషన్ ను భార్యపై చూపిస్తూ ఉంటారు. దీనితో భార్యలకు భర్తపై విముఖత ఏర్పడుతుంది. క్రమంగా వారి ప్రవర్తనలో వచ్చే మార్పు భర్తకు కూడా విముఖత కలిగేలా చేస్తుంది. చిన్న చిన్న విషయాలను మొదట్లోనే గుర్తించకపోవడం వలన గొడవలు ఎక్కువై.. అది పక్క చూపు చూసేలా చేస్తుంటుంది. అక్రమ సంబంధాలు ఈ మూడు కారణాల వల్లనే మొదలవుతుంటాయి.


End of Article

You may also like