Ads
మనకు దగ్గు వస్తుండడం సహజమే. అయితే.. మితిమీరి దగ్గు వస్తున్నప్పుడు మాత్రం మనం కచ్చితం గా డాక్టర్ ని సంప్రదిస్తాం. లేదంటే.. మనం అంతకుముందు ఉపయోగించిన దగ్గు టానిక్ పేరు తెలిస్తే అది తెచ్చుకుని తీసుకుంటాం. అయితే.. మీరెప్పుడైనా ఇందులో ఏ పదార్ధాలను ఉపయోగిస్తారో పరిశీలించారా..?
Video Advertisement
సాధారణం గా వాడే దగ్గు మందు లో సహజ మూలికలతో పాటు, కర్పూరాన్ని కూడా వినియోగిస్తారు. ఇవి అన్ని ఘన పదార్ధం లోనే ఉంటాయి. కానీ, మనకు టానిక్ అనేది ద్రవ రూపం లో కావాల్సి ఉంటుంది. ఈ ఘన పదార్ధాలన్నీ నీటిలో కరిగే పదార్ధాలు కావు. అందుకే ఇవి కరిగి, ద్రవ పదార్ధం గా మారడానికి ఒక సాల్యుబుల్ ఏజెంట్ అవసరం అవుతుంది. ఆ సాల్యుబుల్ ఏజెంట్ గా ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు.
అలాగే, ఈ ఆల్కహాల్ అనేది హైడ్రో ఆక్సీ వర్గానికి చెందినది. అందుకే దీనికి ఇతర పదార్ధాలను కరిగించుకునే స్వభావం ఎక్కువ ఉంటుంది. ఇక మూడవ కారణం ఏంటంటే.. దగ్గు మందులో ఉపయోగించే చక్కర ఎక్కువ గా చిక్కబడి, గడ్డ కట్టకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. మరో కారణం ఏంటంటే.. ఈ చక్కెర వల్ల బూజు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనిని బూజు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చెయ్యాలంటే ఆల్కహాల్ అవసరం అవుతుంది.
అదీకాకుండా.. అందరికి తెలిసిన ఉపయోగం ఏంటంటే ఆల్కహాల్ చక్కగా నిద్రపుచ్చుతుంది. రోగి కూడా దగ్గు కారణం గా నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాడు. కొంచం ఈ దగ్గు మందు తీసుకుంటే.. వెంటనే ఉపశమనం కలిగి హాయిగా నిద్ర పడుతుంది.
End of Article