Ads
ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఇవాళ మొదలవుతుంది. చెన్నైలో మొదటి మ్యాచ్ జరగబోతోంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 9వ సారి మొదటి మ్యాచ్ ఆడుతోంది. అంటే, ఐపీఎల్ సీజన్ మొదలైనప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్ ఆడడం ఇది తొమ్మిదవ సారి. అయితే, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే, మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలని రుతురాజ్ గైక్వాడ్ కి అప్పగించారు.
Video Advertisement
ఈ విషయాన్ని టీం సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 ట్రోఫీ ఫోటోషూట్ ఇటీవల జరిగింది. ఇందులో జట్టు కెప్టెన్లు పాల్గొంటారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ పాల్గొన్నారు. అయితే ఇదే జట్టులో రవీంద్ర జడేజా కూడా ఆడుతున్నారు. ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాని పక్కన పెట్టి, యంగ్ ప్లేయర్ అయిన రుతురాజ్ కి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి అనే ఆసక్తి అందులో నెలకొంది. అయితే అందుకు కారణం ధోనీకి, జడేజాకి మధ్య విభేదాలు ఉండడం అని తెలుస్తున్నాయి. ఐపీఎల్ 2022లో మెగా వేలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలని జడేజాకి అప్పగించింది.
కానీ కెప్టెన్సీ వల్ల వచ్చే ఒత్తిడిని జడేజా తట్టుకోలేకపోవడంతో, అది హ్యాండిల్ చేయలేక, ఆ సమయంలో ఈ ప్రభావం అంతా కూడా జట్టు మీద పడి, చెన్నై సూపర్ కింగ్స్ టీం చాలా బలహీనమైన ప్రదర్శన ఇచ్చింది. దాంతో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ స్థానం నుండి జడేజాని తప్పించి, ఆ స్థానంలోకి ధోనీ వచ్చారు. ఆ తర్వాత జడేజాకి గాయం అవ్వడంతో టోర్నీ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే ధోనీకి, జడేజాకి మధ్య గొడవలు జరిగాయి అనే వార్త ఒకటి బయటికి వచ్చింది. కానీ ఇది తప్పుడు ప్రచారం అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఈ విషయాన్ని ఖండించారు.
ఐపీఎల్ 2023 లో కెప్టెన్సీ బాధ్యతలని ధోనీ తీసుకున్నారు. అప్పుడు జట్టు విజయం సాధించింది. జడేజా అందులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో అయితే బాధ్యత మొత్తాన్ని తన భుజం మీద వేసుకొని జడేజా జట్టును గెలిపించారు. దాంతో, అప్పుడు వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్న విషయం నిజం కాదు అని అన్నారు. కానీ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలని రుతురాజ్ కి అందించడంతో మళ్లీ విభేదాల వార్త బయటకు వచ్చింది.
కానీ టీం యాజమాన్యం, ఈ విషయం మీద మైకేల్ మీడియా వాళ్లతో మాట్లాడుతూ, “కెప్టెన్ స్థానంలోకి జడేజాని పరిగణలోకి తీసుకోలేదు” అని అన్నారు. అప్పట్లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ ఒత్తిడిని కూడా జడేజా తట్టుకోలేకపోయారు అనే విషయాన్ని గుర్తు చేశారు. దేశవాళీ క్రికెట్ లో రుతురాజ్ కి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా అతను కుర్రాడు. ఈ కారణంగానే అతడిని కెప్టెన్సీ కోసం తీసుకున్నారు అని చెప్పారు. దాంతో ధోనీకి, జడేజా కి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అనే విషయం మీద స్పష్టత వచ్చింది.
ALSO READ : IPL 2024 : ఈసారి ఐపీఎల్ లో కొత్త ట్విస్ట్… DRS లేదు…బదులుగా SRS..! ఇది ఎలా పని చేస్తుందో తెలుసా..?
End of Article