Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.
Video Advertisement
ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. చిరంజీవి నటన బాగున్నా కూడా చాలా సీన్స్ లో చాలా డల్ గా ఎనర్జీ లేకుండా నటించారు అన్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ కొరటాల శివ అని ట్రెండ్ అవుతోంది. కానీ దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని చాలా మంది ఆలోచిస్తున్నారు. గత కొంతకాలంగా కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించి వచ్చిన రిజల్ట్ వల్ల కొన్ని సమస్యల్లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల శివ ముందు గత అర్ధరాత్రి నుండి బైఠాయించారు. ఒకవేళ సినిమాకి వచ్చిన నష్టాల సమస్యలు తీరకపోతే చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని అంటున్నారు. దాదాపు 15 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. దాంతో నెటిజన్లు అందరూ, “ఒక్క సినిమాకి రిజల్ట్ ఇలా అవ్వగానే కొరటాల శివని అందరు ఎందుకు ఇలా అంటున్నారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై అయితే ఇంకా ఆందోళన కొనసాగుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో రాబోతున్న సినిమా దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ప్రకటించారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది.
End of Article