Big Boss: ప్రియాంక ప్రేమను మానస్‌ ఎందుకు ఒప్పుకోలేదు..?

Big Boss: ప్రియాంక ప్రేమను మానస్‌ ఎందుకు ఒప్పుకోలేదు..?

by Anudeep

Ads

బిగ్‌ బాస్‌ హౌస్ లో టాస్క్ ల హంగామా మరింత ఎక్కువ అవుతోంది. గేమ్ పూర్తి కావోస్తుండడంతో.. ఇంట్లోని సభ్యులంతా తమ శక్తి మేరకు ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పంతాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Video Advertisement

అయితే.. బిగ్ బాస్ జోడిలలో మానస్-ప్రియాంక జోడి క్యూట్ గా ఉంటుందని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉండేది. అయితే రీసెంట్ గా ఈ జోడి మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోంది.

priyanka

ప్రియాంక పెట్టిన ప్రపోజల్ ను మానస్ తిరస్కరించడంతో.. పింకీ కొంచం డల్ గానే కనిపిస్తోంది. గేమ్ లో బాగానే ఆడుతోంది. కానీ డల్ గా ఉంది అన్న విషయం క్లియర్ గానే తెలుస్తోంది. హౌస్ లో అందరు తనని సిస్టర్ అని పిలిచేసినా.. మానస్ మాత్రం ఆమెను ఫ్రెండ్లీగానే చూసాడు. అతని నేచర్ కే ప్రియాంక ప్రేమలో పడిపోయింది. అయితే మానస్ తల్లి చాటు బిడ్డ. ఏ డెసిషన్ అయిన తన తల్లిని అడిగే తీసుకుంటాడు. వీరి రిలేషన్ పై స్పందినచిన మానస్ తల్లి.. ప్రియాంక అంటే ఇష్టమేనని.. కానీ ఈ రిలేషన్స్ అన్ని బిగ్ బాస్ వరకేనని.. వారిద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతారని.. నేను ఎవర్ని చేసుకోమంటే మానస్ వారినే చేసుకుంటాడని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి.. వీరిద్దరి మధ్య బంధం బిగ్ బాస్ వరకే పరిమితం అని అనుకోవాలేమో..


End of Article

You may also like