Ads
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. దాంతో ఆనాటి ఒక జనరేషన్ ముగిసి పోయింది. ఆయన పార్థివదేహానికి కడసారి వీడ్కోలు పలకడానికి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. బాలకృష్ణ, జయప్రద మొదలు కొని కుర్ర హీరోలతో సహా అందరూ హాజరయ్యి ఆయనకు నివాళి అర్పించారు.
Video Advertisement
అయితే టాలీవుడ్ మొత్తం తరలి వచ్చినా కృష్ణను కడసారి చూడటానికి నాగార్జున హాజరు కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో నాగ్ ఎక్కడ అనే చర్చలు మొదలయ్యాయి. ఘట్టమనేని, అక్కినేని కుటుంబాలకు ముందు నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. కృష్ణను అమితంగా అభిమానించే సినీ ప్రముఖులలో నాగార్జున ఒకరు.. నాగ్, కృష్ణ తో కలిసి ‘వారసుడు’ అనే చిత్రం లో నటించారు. అలాంటి నాగ్ కృష్ణ మరణం పై స్పందిస్తూ ఒక ట్వీట్ చేసారు కానీ.. చూడటానికి రాలేదు.
శోభన్ బాబు తర్వాత కృష్ణ అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేసింది అక్కినేని నాగేశ్వర రావు గారితోనే. వీళ్లిద్దరి కాంబినేషన్లో బంగారు బాబు, కుల గోత్రాలు, శాంతి నివాసం, అక్క చెల్లెలు, మంచి కుటుంబం, గురు శిష్యులు, ఊరంతా సంక్రాంతి, హేమాహేమీలు, రాజకీయ చదరంగం ఇలా 9 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీళ్లిద్దరి మధ్య మంచి సన్నిహిత్య సంబంధం ఉంది.
నాగ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ లో లేరని.. ఈ రీజన్ వల్లే కృష్ణ అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేకపోయారని.. ఇంతకు మించి నాగార్జున హాజరు కాకపోవడం వెనుక మరే కారణం లేదని చెబుతున్నారు.
మహేష్ తల్లి చనిపోయిన సమయంలో నాగార్జున హాజరైన సంగతి తెలిసిందే. మరో వైపు నాగార్జున తరపున నాగ చైతన్య, అఖిల్ హాజరయ్యారు. మరి ఈ విషయం పై నాగార్జున స్పందిస్తాడో.. లేదో.. చూడాలి.
End of Article