Ads
మెగా డాటర్ నీహారిక కూడా తనకు అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. తన కాళ్లపై తాను నిలబడుతూనే వచ్చారు. ఈటివి లో ఢీ షో యాంకర్ గా పని చేసి, ఆ తరువాత “ముద్దపప్పు ఆవకాయ్” అనే వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఆ తరువాత “ఒక మనసు” అనే సినిమా ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసారు.
Video Advertisement
అయితే.. అంగరంగ వైభవంగా జొన్నలగడ్డ చైతన్యతో నీహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వివాహం అయిన తరువాత నిహారిక నటనకి దూరంగానే ఉన్నారు. మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా.. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే నీహారిక అనూహ్యంగా తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసేసింది. నిన్న మొన్నటి వరకు ఆమె తన ఫామిలీ ఫొటోస్ ను, స్పెషల్ మూమెంట్స్ ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉంది.
అయితే.. ఉన్నట్లుండి ఇన్స్టా అకౌంట్ ఎందుకు డిలీట్ అయ్యింది అనే విషయమై ఫ్యాన్స్ ఆరా తీశారు. దీనితో అసలు విషయం తెలిసింది. ఇటీవల నీహారిక షేర్ చేసిన ఓ జిమ్ వీడియో పై ట్రోల్ల్స్ రావడంతోనే ఆమె అకౌంట్ ని డిలీట్ చేసారని తెలుస్తోంది. అయితే అకౌంట్ డిలీట్ చేయడానికి ఇదే కారణమా..? లేక మరో కారణం ఏమైనా ఉందా అన్న సంగతి తెలియాల్సి ఉంది.
End of Article