బోయపాటి శ్రీను ఇండస్ట్రీ కి వచ్చి 18 ఏళ్ళు అవుతున్నా కేవలం 9 సినిమాలకి మాత్రమే దర్శకత్వం వహించారు. పైగా బోయపాటి శ్రీను మంచి బ్లాక్ బస్టర్ ఇస్తున్నా కూడా పెద్ద హీరోల తో సినిమా చేయడం బోయపాటి శ్రీను కి కష్టంగానే వుంది. బోయపాటి శ్రీను ఇప్పటి వరకు తీసుకువచ్చిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే హిట్ కాలేదు కానీ మిగిలినవన్నీ మంచి హిట్లు అందుకున్నాయి.

Video Advertisement

వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది కానీ ఈ సినిమా 60 కోట్లకి పైగా షేర్ ని వసూలు చేయడం జరిగింది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయింది. పైగా ఈ సినిమా కి సీక్వెల్ కూడా చేయబోతున్నారట. ఎక్కడనుండి అయితే అఖండ ఫస్ట్ పార్ట్ ఆగిందో అక్కడి నుండి రెండో భాగం మొదలవుతుందట. అయితే బాలకృష్ణ తో సినిమా అయిన తర్వాత చాలా మంది పెద్ద పెద్ద స్టార్ హీరోలతో బోయపాటి శ్రీను సినిమా తీస్తాడని అనుకున్నారు కానీ రామ్ తో సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. రామ్ తో పాన్ ఇండియా సినిమాని స్టార్ట్ చేశాడు బోయపాటి. రామ్ సరసన ఇందులో శ్రీలీల నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎనిమిది నెలలు అవుతోంది కానీ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ని కూడా చిత్ర యూనిట్ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియా లో సినిమా షూటింగ్ ఆగి పోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రామ్ అభిమానులు ఏం జరుగుతుందని టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ ప్రచారం లో ఎటువంటి నిజం కూడా లేదని తెలిసాక ఉపశమనం లభించింది ఫ్యాన్స్ కి. రామ్ పుట్టిన రోజు మే నెల లోనే. సో ఈ సినిమా టీజర్ ని అప్పుడు రిలీజ్ చేస్తారేమో అని అంతా అనుకుంటున్నారు మరి ఏం జరుగుతుందనేది చూడాలి.