బాలీవుడ్ సినిమాలపై ప్రభాస్ నిర్ణయం..! ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ సినిమాలపై ప్రభాస్ నిర్ణయం..! ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడినట్టు అయ్యింది. రామాయణం ఆధారంగా చిత్రీకరించిన ఎపిక్ మూవీని… ఓం రౌత్ సరిగ్గా ప్రదర్శించ లేక పోయారని అందరూ నిరాశ పడ్డారు.

Video Advertisement

ఇంకోవైపు ఈ సినిమా పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురుకుంది. సీతా దేవిని చూపించిన విధానం, ఆమె గురించి వర్ణించినవి అబద్ధమని పలు దేశాలు ఆది పురుష సినిమాని బ్యాన్ కూడా చేశాయి.

Prabhas-Project-K-First-Look

ఇదిలా ఉంటే ప్రభాస్ కు బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు పెరిగి పోయారు. అప్పటి నుండి ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అనగానే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ప్రభాస్ నుండి ఇప్పటి వరకు ఆశ నెరవేర్చే సినిమా రాలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, వంటి సినిమాలు అన్నీ వీరబలి సినిమాలుగా నిలిచాయి. ఇక తాజాగా ఆదిపురుష్ ఫెయిల్యూర్ తో మళ్లీ బాలీవుడ్ వైపు కొంత కాలం కన్నెత్తి చూడకూడదు అని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు బాలీవుడ్ దర్శకుల కథలను రిజెక్ట్ చేస్తున్నారట. అంతే కాదు ఇప్పటికే ఒప్పుకున్న సిద్దార్థ ఆనంద్ సినిమాని రిజెక్ట్ చేసేశాడని సమాచారం.

అయితే సిద్దార్థ ఆనంద్ ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇరు హీరోల అభిమానుల అంచనాలకు హద్దులు లేకుండా పోయాయి. సిద్దార్థ ఆనంద్ అంతకు ముందు తీసిన బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. ఇప్పుడు ప్రభాస్, హృతిక్ రోషన్ కలయికతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హిట్ అందించాలని అనుకున్నాడు. కానీ ప్రభాస్ తిరస్కరించడంతో…ఆ కలలు నీటిలో కొట్టుకుపోయినట్టు అయ్యింది. అటు అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. సిద్దార్థ ఆనంద్ కథకు, ప్రభాస్ నిర్ణయం తలుపులు మూసేసింది. చూడాలి మరి మెల్లగా అయినా ప్రభాస్ ఈ సినిమాకి ఒప్పుకుంటాడా లేదా అని.


End of Article

You may also like