తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. వారిలో ప్రధానంగా కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి యాక్టర్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. క్యారెక్టర్ ఏదైనా సరే ఆ పాత్రలలో వారి నటన అద్భుతం అని చెప్పవచ్చు.
Video Advertisement
కోట శ్రీనివాసరావు వయసు మీద పడడంతో సినిమాలలో చేయడం లేదు. ఇక ప్రకాశ్ రాజ్ ఒకవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, ఇంకో వైపు సినిమాలలో తన ప్రతిభను చూపిస్తూ రాణిస్తున్నాడు. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ పోషించిన క్యారెక్టర్స్ లో నటిస్తాడు అనేదాని కన్నా జీవిస్తాడు అని చెప్పవచ్చు. ఆయన చేసేది ఏ పాత్ర అయిన అందులో లీనమై నటిస్తాడు. అందువల్లనే టాలీవుడ్ లోని దాదాపుగా టాప్ డైరెక్టర్స్ అందరు ప్రకాశ్ రాజ్ ని తమ చిత్రాల్లో తీసుకుంటారు. అలాంటి నటుడిని జక్కన్న మాత్రం విక్రమార్కుడు మినహా ఏ సినిమాలోనూ తీసుకోలేదు. మరి రాజమౌళి విలక్షణ నటుడు అయిన ప్రకాశ్ రాజ్ ని ఎందుకు తన సినిమాలలో తీసుకోలేదో ఇప్పుడు చూద్దాం..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ ఆది కూడా 5 నిమిషాలు మాత్రమే తెర మీద కనిపించే పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడు. ఇక ఆ ఒక్క సినిమాలో మాత్రమే రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ కనిపించాడు. అంత మంచి నటుడు ప్రకాశ్ రాజ్ ని రాజమౌళి ఎందుకు తీసుకోరు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయన్ని రాజమౌళిని ఒక సందర్భంలో అడుగగా ఇలా చెప్పుకోచ్చారు.
ప్రకాశ్ రాజ్ ఇప్పటి దాకా చేయని క్యారెక్టర్ ఏది లేదు. ఆయన ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల పాత్రల్లో కనిపించారు. తన చిత్రంలో కూడా మళ్ళీ అలాంటి పాత్రలో నటిస్తే ఆడియెన్స్ కి బోర్ కొడుతుంది. అందువల్ల ఆయనను తీసుకోలేదు.ఇప్పటి దాకా ప్రకాశ్ రాజ్ చేయని క్యారెక్టర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆయనతో నా మూవీలో తీసుకుంటానుని రాజమౌళి వెల్లడించారు.
అయితే రాజమౌళి చూపించే ఎలివేషన్స్ లకి ప్రకాశ్ రాజ్ లాంటి నటుడు విలన్ గా చేస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాగే రాజమౌళి చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో ప్రకాశ్ రాజ్ నటిస్తే బాగుండేదని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక రాబోయే రాజమౌళి చిత్రాల్లో అయిన ప్రకాశ్ రాజ్ కి నటించే అవకాశం వస్తుందో వేచి చూడాలి.
Also Read: ఉపేంద్ర “కబ్జ” ఫస్ట్ రివ్యూ..!! సినిమా ఎలా ఉందంటే..?