“మహేష్ బాబు” లా.. “రమేష్ బాబు” ఎందుకు యాక్టర్ అవ్వలేదు..? ఆసక్తికర విషయాలు చెప్పిన “సూపర్ స్టార్ కృష్ణ”..!

“మహేష్ బాబు” లా.. “రమేష్ బాబు” ఎందుకు యాక్టర్ అవ్వలేదు..? ఆసక్తికర విషయాలు చెప్పిన “సూపర్ స్టార్ కృష్ణ”..!

by Anudeep

Ads

సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన యాక్షన్ మూవీస్ కి ఒకప్పుడు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. అల్లూరి సీతారామరాజు గా ఆయన కనబరిచిన నటనను ఏ తెలుగు ప్రేక్షకుడు అంత తొందరగా మరిచిపోలేదు. ఆయన బాటలోనే తనయుడు మహేష్ బాబు కూడా అడుగులు వేశారు. సూపర్ స్టార్ గా మహేష్ బాబు కూడా అభిమానుల గుండెల్లో నిండిపోయారు.

Video Advertisement

ramesh babu

అయితే సూపర్ స్టార్ కృష్ణ కు మరో కుమారుడు రమేష్ బాబు కూడా ఉన్నారు. ఆయన సినిమాలలో ఎక్కువ గా కనిపించలేదు. ఈ విషయాన్నే సూపర్ స్టార్ కృష్ణ వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన సూపర్ స్టార్ కృష్ణ తన తనయులు మహేష్, రమేష్ లు “పోరాటం” సినిమా లో కలిసి నటించారని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో ఇద్దరు చక్క గా నటన కనబరిచినప్పటికీ.. ఆ సినిమా తరువాత రమేష్ బాబు కు మంచి సినిమాలు పడలేదు.

super star krishna

దీనితో రమేష్ బాబు కు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి తగ్గిపోయింది. దానితో ఆయన యాక్టర్ గా అవ్వాలని అనుకోలేదట. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ఆయన కచ్చితం గా గొప్ప నటుడు అవుతాడు అన్న సంగతి తమకు ముందే తెలుసు అని కృష్ణ చెప్పుకొచ్చారు. కోడలు నమ్రత గురించి మాట్లాడిన కృష్ణ ఆమె ఈ సినిమా, బిజినెస్ వ్యవహారాలను పట్టించుకోదని.. అన్ని తన కొడుకే చూసుకుంటాడని చెప్పుకొచ్చారు. ఇంకా పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన చెప్పారు. వాటిని ఈ కింద వీడియో లో చూడొచ్చు.

Watch Video:


End of Article

You may also like